విద్యార్థులపై అమానుషం

0
469

– జేఎన్‌యూలో పోలీసుల జులుం.. అనేకమందికి గాయాలు
– పార్లమెంట్‌కు వేలాది మంది లాంగ్‌మార్చ్‌
– అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
– అన్ని గేట్లూ మూసేసిన పోలీసు బలగాలు
– అధ్యక్షురాలు సహా 120 మంది నేతల అరెస్టు
– చివరికి కుట్రలను ఛేదించి బయటికి..
– సాధారణ పరిస్థితులకు ఎంహెచ్‌ఆర్డీ కమిటీరణరంగంగా ఢిల్లీ వీధులు

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తమైంది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు అమానుష దాడికి దిగాయి. విద్యార్థులపై లాఠీలను ప్రయోగిస్తూ అత్యంత దుర్మార్గంగా పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. కొంతమందికి రక్తం కారుతున్నా పోలీసులు వదలలేదు. గాయాలపాలైన విద్యార్థులను ఎయిమ్స్‌కు తరలించారు. విద్యార్థినీలపై మగ పోలీసులు ప్రతాపం చూపించారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు నితీష్‌నారాయణలతో పాటు 120 మంది విద్యార్థి నేతలను అరెస్టు చేశారు.అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది విద్యార్థులను దారుణంగా కొట్టారు. వారందర్నీ అక్రమంగా మూడు బస్సుల్లో ఢిల్లీ కంటోన్మెంట్‌, కల్‌కాజీ తదితర పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.
‘ప్రభుత్వ విద్యను కాపాడాలి’ అంటూ జేఎన్‌యూ నుంచి పార్లమెంట్‌ వరకు లాంగ్‌మార్చ్‌కు జేఎన్‌యూఎస్‌యూ పిలుపు ఇచ్చింది. ఈ మార్చ్‌లో అన్ని యూనివర్సిటీల విద్యార్థులను ఆహ్వానించింది. దీంతో వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆదివారమే వర్సిటీ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఆదివారం రాత్రే అన్ని గేట్లు మూసివేశారు. విద్యార్థులు లాంగ్‌మార్చ్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు వేలాది బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీని పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు. లాంగ్‌మార్చ్‌ను అణచివేసేందుకు పోలీసులు చేసిన కుట్రలు సాగలేదు. సోమవారం ఉదయం తొలుత విద్యార్థులంతా సబర్మతి దాబా వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి లాంగ్‌ మార్చ్‌ను ప్రారంభిం చారు. శాంతియుతంగా మార్చ్‌ చేయాలని విద్యా ర్థులు నిర్ణయించుకున్నారు. వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతూ ముందుకు సాగారు. విద్యార్థుల దండును ఎదు ర్కొందుకు అన్ని గేట్ల వద్ద పోలీసులు కాపలా కాశారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తిస్తూ వస్తున్న విద్యార్ధుల ప్రవాహం చూసి పోలీసులు బిత్తరపోయారు. ర్యాలీ వర్సిటీ ముఖద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు జులుం ప్రదర్శించారు. లాఠీలను ప్రయోగించారు. ముందు గా ర్యాలీకి అగ్రభాగాన ఉన్న జేఎన్‌యూఎస్‌యూ నేతలను అరెస్టు చేశారు. మూడు బస్సుల్లో విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అరెస్టు చేసే క్రమంలో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంత మందికి తీవ్రమైన రక్తస్రావం జరిగింది. వారి రక్తంతో రోడ్డు ఎరుపుమయం అయ్యింది. ఆ ప్రాంతమంతా రణరం గంగా మారింది. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నాం మూడుగంటల వరకు దాదాపు ఐదు గంటల పాటు పోలీ సులకూ విద్యార్థులకూ మధ్య తోపులాటచోటు కొనసాగింది.
విద్యార్థి ప్రవాహం దాటికి పోలీసులు, బారికేడ్లు చిందరవందర అయ్యాయి. దీంతో మూడు గంటలకు విద్యార్థుల లాంగ్‌మార్చ్‌ ప్రారంభమైంది. యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తరువాత కేంద్రీయ విద్యాలయ స్కూల్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లును తోసుకొని మార్చ్‌ ముందుకు సాగింది. ఆర్కేపురం, ఎయిమ్స్‌, సబ్దర్‌జంగ్‌ మీదుగా జోర్‌బాగ్‌ వరకు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు లాంగ్‌మార్చ్‌ సాగింది. జోర్‌బాగ్‌ నుంచి పృద్వీరాజ్‌ చౌహన్‌ రోడ్డుకు వెళ్లే మార్గంలో మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లాఠీలతో దాడికి పూనుకున్నారు. దీనికి నిరసనగా జోర్‌బాగ్‌ ప్రాంతంలో ప్రధాన రోడ్డుపైనే కూర్చోని ఆందోళన చేశారు. రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులు అక్కడే కూర్చొని ఉన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వీధిలైట్లను ఆపేసి మళ్లీ లాఠీచార్జ్‌కు పూనుకున్నారు. దారిపొడుగునా విద్యార్థుల ఇచ్చిన నినాదాలతో ఢిల్లీ వీధులు దద్దరిల్లాయి.

జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దాడిని పలు సంస్థలు ఖండించాయి. సీపీఐ(ఎం) తదితర రాజకీయ పార్టీలు ఖండించగా, జేఎన్‌యుటీఏ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఏంయు ఎస్‌యుతదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యా ర్థులు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తున్నా రని విమర్శించాయి. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యా ర్థులపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించాయి.
విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం, విద్యార్థులను చర్చలకు పిలిచింది. ఎంహెచ్‌ఆర్డీ చర్చలకు ఆహ్వానించడంతో జేఎన్‌యూఎస్‌యూ కార్యవర్గ సభ్యులు చర్చలకు హాజరయ్యారు. విద్యార్థు లంతా ఆందోళనను ముగించి యూనివర్సిటీకి వెళ్లారు.

ఎంహెచ్‌ఆర్డీ కమిటీ
జేఎన్‌యూలో సాధారణ పరిస్థితుల నెలకొల్పేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. యూజీసీ మాజీ చైర్మెన్‌ విఎస్‌ చౌహన్‌, ఏఐసీటీఈ చైర్మెన్‌ అనిల్‌ సహాస్రబుద్దీ, యూజీసీ కార్యదర్శి రాజీనిష్‌ జైన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వెంటనే విద్యార్థులు, యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌తో చర్చించి, తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పిస్తుంది.
కార్పొరేట్లకు లక్షల కోట్లు ఇస్తారు..

విద్యకు నిధులు లేవా?
జేెఎన్‌యుఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీఘోష్‌ మాట్లాడుతూ కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇచ్చినప్పుడు, విద్యారంగానికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. హాస్టల్‌ ఫీజుల పెంపు వెనక్కి తీసుకోవాలని, హాస్టల్‌ మాన్యువల్‌ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.94,036 కోట్లు విద్యారంగ నిధులు ఖర్చు చేయలేదని, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.7,298 కోట్లు ఖర్చు చేయలేదని 2019 ఫిబ్రవరిలో కాగ్‌ తెలిపిందన్నారు. నూతన విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్య నిర్వీర్యం అవుతుందని, విదేశీ, కార్పొరేట్‌ యూనివర్సిటీలకు తలుపు తెరిచినట్టు అవుతుందని విమర్శించారు. సీబీఎస్‌, ఐఐటీి, నవోదయ విద్యాలయ, మెడికల్‌ కాలేజీల ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థ ల్లో ఫీజులు పెంచకూడదని, విదేశీ యూనివర్శిటీలకు అనుమతులు ఇవ్వకూడదని కోరారు.

Courtesy NavaTelangana….

Leave a Reply