పవార్ దెబ్బకు బీజేపీ విలవిల…!!

0
233

రాజకీయం ఒకరి సొత్తు కాదు. చాణక్యం ఒకరి సొంతం కాదు, ఎవరైనా, ఎవరినైనా ఎపుడైనా పడొగొట్టేయవచ్చు. నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనక కూడా మోడీ షాల చాతుర్యం కంటే కూడా విపక్షాల ఫెయిల్యూర్ ఎక్కువగా కనిపిస్తుంది. లేకపోతే మోడీ మీద మోజు ఎక్కువగా ఉంటే మహారాష్ట్రలో, హర్యానాలో ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తాయి. ఇపుడు బీజేపీ ఇంత తెలివితక్కువగా నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది…

మొత్తానికి దేశంలో అత్యంత శక్తివంతులు అని జబ్బలు చరుచుకుంటున్న మోడీ, షాల విఫల రాజకీయాలకు అచ్చమైన ఉదాహరణగా మహారాష్ట్ర ఎపిసోడ్ ని చెప్పుకోవాలి. మెజారిటీ లేకుండా గద్దెనెక్కితే ఎలా బొక్క బోర్లా పడతారో కర్నాటక ఎపిసోడ్ తేల్చి చెప్పిన తరువాత కూడా మళ్ళీ మళ్లీ ప్రయోగాలు చేయడం అంటే బీజేపీ రాజకీయం ఎంత నాసిరకంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

ఇపుడు దేశానికి ఒక్కటి మాత్రం అర్ధమైంది. కాలం కలసిరావడంతో మోడీ, షా ద్వయం ఇలా తమ హవా చాటుకుంటున్నారు తప్ప సరైన రాజకీయ పార్టీ ఎదురుగా నిలిచి సవాల్ చేస్తే మాత్రం జవాబు చెప్పలేరన్నది నిన్నటి కర్నాటక్, నేటి మహారాష్ట్ర పరిణామాలు నిరూపించాయి. ఇపుడు బీజేపీకి పరువు పోయింది. నిండా మునిగింది. అయినా ఫలితం మాత్రం దక్కలేదు.

అయినా బీజేపీ ఇంతటితో వూరుకుంటుందని చెప్పలేం. రేపు జార్ఖండ్ లో మెజారిటీ రాకపోతే అక్కడ కూడా ఇదే కధ మొదలుపెడుతుంది. అయితే ప్రతీఎ ఎపిసోడ్ క్లోజ్ అయ్యేటప్పటికి మాత్రం బీజేపీ పరాజితగానే మిగిలిపోతున్న సంగతి అంతా గమనించాలి. ఒక విధంగా ఇపుడు ఉన్నది అసలు బీజేపీయేనా అనిపిస్తోంది. ఒక్క ఓటు కోసం ఏకంగా దేశంలోని అత్యున్నతమైన ప్రధాని పదవిని వదులుకున్న వాజ్ పేయి ఎక్కడా. మెజారిటీకి ఆమడదూరంలో ఉన్నా కూడా కుర్చీ కోసం అంగలార్చే ఈనాటి బీజేపీ ఎక్కడ. ఇదే తేడా మరి

Courtesy Ihg

 

Leave a Reply