త్వరలో గ్రామాల్లోనూ ‘చెత్త’ ఛార్జీలు!

0
655

ప్రపంచబ్యాంకు అజెండా పల్లెలకు చేరింది. గ్రామాల్లోనూ చెత్త సేకరణకు సేవా రుసుం వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా ‘మన ఊరుామన పరిశుభ్రత’ పేరుతో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారుగా 1000కు పైగా గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం చెత్త సేకరణకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అన్ని జిల్లాల్లోనూ ప్రతి మండలం నుంచి కనీసం రెండు పంచాయతీలను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా రోజుకు రూ.2 చొప్పున నెలకు రూ.60 ప్రతి ఇంటి నుంచీ వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి కట్టించుకుంటున్నారు. ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతతో పాటు చెత్త సేకరణను పర్యవేక్షించే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగించారు. నేరుగా యూజర్‌ఛార్జీలు, సేవా రుసుమని అనకుండా అనేక చోట్ల విరాళాల పేరుతో వసూలు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎవరైనా కట్టలేమని చెబితే వారికి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నట్లు సమాచారం.

గుంటూరులో జూన్‌ నుండి..
గుంటూరు జిల్లాలో 112 గ్రామాల్లో చెత్త సేకరణకు రుసుము వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళగిరి మండలంలో కాజా, రామచంద్రపురం గ్రామాలు వీటిలో ఉన్నాయి. జూన్‌ నెల నుండే ఇక్కడ చెత్త సేకరణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

అనంతపురంలో 126 గ్రామాలు
అనంతపురం జిల్లాల్లో 126 గ్రామ పంచాయతీలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఛార్జీలు కచ్చితంగా వసూలు చేశారని, అయితే, రెండురోజులకు ఒకసారి మాత్రమే చెత్తసేకరిస్తున్నారని తాడిపత్రి మండలం చల్లావారిపల్లె వాసులు తెలిపారు.

ప్రజాగ్రహంతో ఆగింది
విజయనగరం జిల్లా డెంకాడ మండలం పినతాడివాడలో తాము ఛార్జీలు చెల్లించేది లేదని గ్రామస్తులంతా మూకుమ్మడిగా పంచాయతీ సిబ్బందికి తేల్చి చెప్పారు. దీంతో వసూళ్లు ఆగిపోయాయి. మెరకముడిదాం మండలం భైరిపురంలో కూడా పజల నుంచి వ్యతిరేకత రావడంతో ఛార్జీల వసూలు మానేశారు. ఈ జిల్లాలో 68 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలు పంచాయతీలో కూడా ప్రజలు తిరగబడటంతో జులై నెల నుండి యూజర్‌ఛార్జీలు వసూలు చేయడం లేదు

కడపలో వాలంటీర్లకు లక్ష్యాలు!
కడప జిల్లాలో 118 పంచాయతీలను ఎంపిక చేశారు. డబ్బుల వసూలుకు అధికారులు వాలంటీర్లకు కార్డులు ఇచ్చారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి జరిగే పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రతి వాలంటీర్‌ తన పరిధిలోని 50 మంది నుంచి యూజర్‌ ఛార్జీలు తప్పనిసరిగా వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు

కృష్ణలో మండలానికి గ్రామాలు
కఅష్ణా జిల్లాలో 49 మండలాలు ఉండగా, మొదటి విడతలో ప్రతి మండలం నుంచి రెండు గ్రామాల చొప్పున, ఆ తర్వాత రెండో విడతలో మరో రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. యూజర్‌ ఛార్జీలు తమకు భారంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Courtesy Prajashakti

Leave a Reply