మొదట మనం నేర్చుకుంటేనే, ఇతరులకు నేర్పగలం!

0
251

సమాజంలో ఉన్న నిజా ల్ని, మొదట మనం నేర్చుకోవాలి. వాటిని తర్వాత ఇతరులకు నేర్పించాలి! మార్క్స్‌ – ఎంగెల్స్‌ల రచనల్ని, వాటిలో ముఖ్యంగా ‘కాపిటల్‌’ని, నిజమైన ఆసక్తితోటీ, బాధ్యతతోటీ, చదివే పాఠకులు ఎక్కువ మందే ఉంటారు, ఉన్నారు. వారిలో కొందరు, నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆప్రశ్నల వల్ల, వారు ‘కాపిటల్‌’ని చదు వుతున్నారని ఆనందం కలిగినా, వారి ప్రశ్నల్ని చూస్తూ ఉంటే, వారి ఆసక్తి మీద అనుమానా లో, ఆశ్చర్యాలో, కలగక మానడం లేదు. సాధారణంగా, ఆ పాఠకులు అడిగేదంతా ఇలా ఉంటుంది: ‘మీరు తరుచుగా మార్క్స్‌ రాసిన ‘కాపిటల్‌’నే మొదట చదవ మని చెపుతూ ఉంటారు. నేను నిజంగా, ఏడెనిమిది నెలల కాలంలో, ఆ పుస్తకం చదివాను.

చదువుతూ ఉం టే, అర్థమైనట్టే అనిపిస్తుంది. అయితే, దాన్ని చదవని స్నేహితులకు చెప్పాలని ప్రయత్నిస్తోంటే, వాళ్లు అడిగే దానికి సరిగా, ధారాళంగా చెప్పలేకపోతాను. ఆ పుస్తకా న్ని, విశాలాంధ్ర వారి, ‘కాపిటల్‌’ తెలుగు అనువాదాన్ని కూడా మళ్లీ అక్కడక్కడా తిరగేసినా, అప్పుడు కూడా సంతృప్తిగా చెప్పలేను. ‘శ్రమ దోపిడీ’ అనే దాన్ని, మా వాళ్లు తెలుసుకునే విధంగా వివరించలేకపోతాను. ఇటువంటి అనుభవాల వల్ల, నేను మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘కాపిటల్‌’ నించి ముఖ్యంగా ఏయే సిద్ధాంత విషయాలు తెలుసుకోవాలో వాటిని, ఇలా చదివి, అలా చెప్పగలిగే విధంగా, చిన్న చిన్న వ్యాసాలుగా మీరు రాయటం అవసరమనిపిస్తోంది. ఇది సాధ్యం కాదం టారా? ఇదే మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఆలోచిం చగలరు’. ఇలా ఉంటాయి, ఆ సందేహాలు!
ఒక ‘కథ’ అయితే, దాన్ని ఒకసారి చదివి, దాన్ని చ దవని వాళ్లకి తెలిస్తే చెప్పగలం. కానీ, సిద్ధాంత విష యాలైతే, క్లుప్తంగా కాదు, వివరంగా చదివితేనే సరిగా నేర్చుకోగలం. నేర్చుకుంటేనే ఇతరులకు చెప్పగలం. అ ది నిజమే గానీ, క్లుప్తంగా చెప్పే మార్గం కూడా మంచి ది. మార్క్స్‌ ‘కాపిటల్‌’లో కొన్ని చాప్టర్లు చాలా తేలికగానే ఉన్నా, కొన్ని చాప్టర్లు మనకు కఠినంగానే అనిపిస్తాయి. అయినా, మార్క్స్‌కి, ఆ సిద్ధాంతం అంతటినీ, మహా తేలి కగా రాయడానికి టైమూ లేదు, ఆరోగ్యమూ లేదు. ఎం త కఠినంగా అయినా ఆ సిద్ధాంతం మొత్తం దొరికినం దుకే మనం సంతోషించి, దాన్ని మనం తేలికగా చేసు కోవాలి.

మార్క్స్‌, ‘కాపిటల్‌’లో, మొదటి భాగంలోనే సరి గా అర్థం కాని ఇబ్బంది వచ్చిందని పాఠకులు మార్క్స్‌కి ఫిర్యాదులు చేస్తే, ‘సరే, దాన్ని మళ్లీ మార్చి రాస్తాను’ అ ని మార్క్స్‌ అన్నాడు గానీ, ఆ మార్పుని తగినంతగా చేయలేకపోయాడు. ఇతర భాగాలన్నిటినీ నోట్సులుగా నే వదిలేసి వెళ్లిపోయాడు! ఎంగెల్స్‌ సవరింపులతోనే మిగిలినదంతా పుస్తకాలుగా తర్వాత వచ్చింది. ఆ విషయాలు అక్కడక్కడా కఠినంగా ఉన్నా, అవి అసలు ఉండడం వల్లే, మానవ సమాజంలో ఉన్న వైరుధ్యాలన్నీ తెలుస్తున్నాయి. అవి లేకపోతే, ‘శ్రమ దోపిడీ’ అనే అసలు వాస్తవాన్ని గ్రహించగలిగే వాళ్లం కాదు. దీన్ని గ్రహించడం, పాఠకులుగా మన బాధ్యత.
‘కాపిటల్‌’ చదివినా, కొందరు పాఠకులు అడిగే సందేహాలు ఇలా ఉంటున్నాయి.
మొదటి సందేహం: ఒక వస్తువుని ఇచ్చి, దానికి బదులుగా ఇంకో వస్తువునో, లేదా కొంత డబ్బునో, తీ సుకుంటే, అది ఇచ్చిన వస్తువుకి ‘మారకం విలువ’ అవు తుందని తెలుసు. అయితే, ఒక వస్తువు ధర, 5 రూపా యలు అనుకుందాం. ఆ ధరే, ఆ వస్తువుకి ‘మార కం విలువ’ అయినట్టే నా? ఒక వేళ, ఆ 5 ధరే, ఆ వస్తువుకి ‘మారకం వి లువ’ కాదనుకుంటే, ఆ విలువ, ఎప్పుడు తెలుస్తు ంది? ఎలా తెలుస్తుంది?
నా జవాబు:ఈ ప్రశ్న ఎంతో నచ్చింది నాకు. నేను కూడా ఆ విషయా న్ని చక్కగా అర్థమయ్యేలాగ చెప్పలేదేమో అనే సందే హం కూడా కలిగింది నాకు. అందుకే మరి, ‘కాపిటల్‌’ లాంటి పుస్తకాలు చదివిన తర్వాత, ఆ విషయాల మీద మళ్లీ, మళ్లీ చర్చలు ఎంతో అ వసరం. ఒక సరుకు ధర 5 అయితే, అదే దాని ‘మారకం విలువ’ అయినట్టా?-అని అడగడమంటే, ‘మారకం విలువ’ని తెలుసుకోవా లనే ఎంతో మంచి ఆసక్తి అది. ఆ ఆసక్తి వల్ల కలిగిన స దేహం అది. ఏ వస్తువుకై నా ‘మారకం విలువ’ అనేది, ఆ వస్తువు తయారీకి అవసరమైన ‘మొత్తం శ్రమ కాలా న్ని’ బట్టే కదా? అంతే కాదు ఆ ‘శ్రమ’కి ఉండే విలువ, తక్కువో-ఎక్కువో అవుతుంది కదా? ‘1 గంట శారీరక శ్రమ’కి కొంత తక్కువ విలువ అయితే, అదే ‘1 గంట మేధా శ్రమ’కి కొంత ఎక్కువ విలువ అవుతుంది కదా? ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పుకుంటే, ఇది క్లుప్తంగా చె ప్పినట్టు అవదు.అయినా, ఈమాత్రంగా చెప్పుకోక తప్పదు. ఒక వస్తువు ధర, 5 రూపాయలు అయితే, అ ది 3 రకాల్లో ఏదో ఒకటి కావచ్చు.

1.ఆ ధరే, ఆ వస్తువు తాలూకు నిజమైన ‘విలువ’ కావచ్చు.

2.లేదా, ఆ ధర, నిజమైన విలువకన్నా కొంత తక్కువది కావచ్చు.

3.లే దా, ఆ ధర, నిజమైన విలువకన్నా కొంత పెద్దది కావ చ్చు.

ఏ వస్తువుని కొన్నప్పుడైనా, దానికి చెల్లించే ‘ధర’నే, దాని ‘మారకం విలువ’గా భావించడానికి వీలులేదు. ఎందుకంటే, ఆ వస్తువుని కొనాలంటే, ఆ వస్తువు తేలిగ్గా దొరుకుతోందో లేదో, ఆ సమస్య ఉంటుంది. అంటే, దాని సప్లరు-డిమాండ్ల సమస్య. ఆ సమస్య లేకపోతే, అంటే దాని సప్లరు-డిమాండ్లు సమానంగా ఉంటే, దాని ధరే దాని ‘విలువ.’
2వ సందేహం: ఒక సరుకుని విడిగా చూస్తే, దా ని ధర తెలుస్తుంది. దాని ‘మారకం విలువ’ ఎలా తెలు స్తుంది? ‘దీని విలువ ఇంతే’ అని ఎలా తెలుసుకోగలం?
నా జవాబు: ఏ ముడిసరుకు గురించీ కూడా దాని ‘ధర’ని స్పష్టంగా చూడగలం గానీ, దాని ‘మారకం విలు వ’ని, ‘అది ఇంతే’ అని తెలుసుకోలేము. అయితే, మార కం విలువని తెలుసుకునే మార్గం, మొత్తం అమ్మకమైన సరుకులన్నిటి ధరల్నీ కలిపితేనే. బరువుల్నీ, పొడుగుల్నీ, రంగుల్నీ అయితే, ప్రతీ విడి వస్తువు గురించీ తెలు సు కోగలం. కానీ, ‘మారకం విలువ’ అనేది, ‘శ్రమ కాలం’ వ ల్ల ఏర్పడేది కదా? ఆ శ్రమ కాలం కళ్లకు కనపడేది కా దు కదా? అందుకనే, విడి కాలాలు తెలియవు. ఒక స ంవత్సరం మొత్తం కాలం లో, వ్యవసాయ సరుకు లూ, పారిశ్రామిక సరుకు లూ, అన్నిటి ధరల్నీ కలిపె య్యాలి. ఆ ధరల మొత్త మే, ఆ సరుకుల విలువల మొత్తం. అంత శ్రమ కాలం తో, మొత్తం సరుకుల రాశికి ఉన్న విలువ మొత్తం తెలు స్తుంది. అంటే, ఆ సంవత్స రం పొడుగునా, శ్రమలు చే సిన ప్రజలు, అంతకాలం పని చేసి, ఆ సరుకుని తయా రు చేశారన్న మాట! వాళ్ల శ్రమ కాలమే, ఆ సరుకుల విలువల మొత్తం.
3వ సందేహం: శ్రామికుల ‘శ్రమ విలువ’లో నించి, ‘అదనపు విలువ’ని ఎలా తెలుసుకోగలం?
నా జవాబు: ఈ సందేహం మరీ అన్యాయం, ‘కాపిటల్‌’ చదివితే, ఇది అర్థం కాలేదా? ఒక సమాజం మొత్తంలో ఉన్న శ్రామిక జనమంతా కలిసి చేసిన ‘శ్రమ కాలం విలువని 40’ అనుకుందాం. ఆ శ్రామిక జనానికే ఆ 40 చేరాలి కదా? శ్రమ చేసిన వాళ్లు, వాళ్లే కాబట్టి. కానీ, అది అలా వాళ్లకి వెళ్లదు. వాళ్లకి వెళ్లేవి ‘జీతాల’ పే ర్లతోనే. ఆ జీతాలన్నీ కలిసి 20 విలువతో వెళ్తాయి అను కుందాం. 40 శ్రమ విలువలో నించి, 20 విలువ మాత్ర మే జీతల పేర్లతో వెళ్తే, ఇంకా మిగిలేది ఇంకో 20. ఇది కూడా శ్రామికులదే. కానీ దాన్ని, యజమానులు వడ్డీ లూ, లాభాలూ, భూమి కౌళ్లూ, అమ్మకం కమిషన్లూ -వంటి 10 రకాల పేర్లతో యజమానులు లాగేస్తారు. అ దే కార్మికుల అదనపు విలువ. యజమానులు స్వంత శ్ర మలు చెయ్యరు కదా? వాళ్లు, కార్మికుల శ్రమలో నించీ కొంత భాగాన్ని లాక్కోకపోతే ఎలా బతుకుతారు?ఈ సంగతులేవీ, కార్మిక ప్రజలకు తెలియవు. వాళ్లు తమకు జీతాలు వస్తే చాలనుకుంటారు. ఒక్కోసారి జీతాల్ని కొం చం పెంచమని అడుగుతారు. జీతాల్ని పెంచితే, యజ మానులకు అందే అదనపు విలువ భాగం తగ్గుతుంది. అంతే. జీతాల్ని ఎంత పెంచినా, కార్మికులకు పేదతనం తగ్గడం జరగదు.
4వ సందేహం:ఎద్దులు బళ్లని లాగుతాయి. పొ లాలు దున్నుతాయి. గుర్రాలు మనుషుల్ని మోస్తాయి. ఈ జంతువులు ‘శ్రమలు’ చేస్తున్నట్టే కదా? మరి వీరి నించి ‘అదనపు విలువ’ రాదా?
నా జవాబు: ఈ జవాబుల్లో ప్రతీదీ మార్క్స్‌ చెప్పి నదాని మీద ఆధారపడిందే. ‘శ్రమ’ అనేది, మానవులకు మాత్రమే వర్తిస్తుంది. జంతువులు కూడా ఒక పనిలో ఉ ంటే, అవి ‘సజీవ పనిముట్లే’. యంత్రాల వంటివి కావు. వాటిని మానవులు ఉపయోగించుకుంటారు కాబట్టి, వాటికి కడుపు నిండా మంచి ఆహారమూ, మంచి ని వాసమూ, శుభ్రతా, మందులూ, విశ్రాంతీ, వృద్ధాప్యంలో వాటికి పూర్తి విశ్రాంతీ – ఇవన్నీ ఉంచాలి. జంతువులు అనే వాటిని ‘పనిముట్లే’ అనుకోవాలి.
5వ సందేహం: మార్క్సిజం మాత్రం సమానత్వ సంబంధాల్ని ఎలా ఏర్పర్చగలుగుతుంది? శారీరక శ్రమలకు తక్కువ విలువలూ, మేధా శ్రమలకు ఎక్కువ విలువలూ ఉంటాయి గదా? ఆ రెండు రకాల వాళ్లూ సమానులు ఎలా అవుతారు?
మార్క్స్‌ ప్రకారం జవాబు: ప్రతీ మనిషీ పని చె య్యాలి. కొన్ని శారీరక శ్రమలూ, కొన్ని మేధా శ్రమలూ కూడా చెయ్యాలి. అందరూ అలా చేసినప్పుడు, మానవ సంబంధాలు ఎలా తయారవుతాయి? ఈ విషయాన్ని మార్క్స్‌, తనే (ఒక వ్యక్తి) ఒక రోజులో 4 రకాల శ్రమలు చేసే ఉదాహరణలో చెప్పాడు. ఇది ‘కాపిటల్‌ పరిచయం’లో దొరుకుతుంది.
6వ సందేహం: కులవిధానంఎలా పోవాలని మార్క్సు చెపుతాడు?
మార్క్స్‌ ప్రకారం జవాబు: కుల విధానం పుట్టడ మే శ్రమవిభజనను బట్టి. అంటే, శ్రమల్లో ఎక్కువ తక్కు వ విలువల్ని బట్టి. ఆ తేడాల్ని తీసివేస్తే, సమానత్వ సం బంధాలు ఏర్పడి, ‘కుల విధానానికి’ పునాది మిగలదు.
7వ సందేహం: స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వం లేని పరిస్థితి ఎందుకు?
మార్క్స్‌ ప్రకారమే జవాబు:ఇది కూడా శ్రమ విభజన సమస్యే. వెనకటి కాలంలో ప్రధానంగా స్త్రీలకు ఇంటి పనులూ, పురుషులకు బైటి పనులూ. ఇంటి పనులన్నీ శారీరక శ్రమలే. బైటి పనులు రకరకాల శ్రమలు. వాటి విలువలన్నీ తేడాలే. ఈ శ్రమ విభజన, స్త్రీ పురుషులిద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనిగా మారడమే ఈ సమస్యకు పరిష్కారం.
‘కాపిటల్‌’లో అనేక ప్రశ్నలకు జవాబులు దొరుకు తాయి. అందుకే ‘కాపిటల్‌’ని మళ్లీమళ్లీ చదువుకోవాలి.
రంగనాయకమ్మ

                                                                                             Courtesy Navatelangana..

Leave a Reply