కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

0
234

బదిలీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం

ఇదివరకెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి నిధుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఆర్‌బీఐ గత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌కు, మోదీ ప్రభుత్వానికి మధ్య ఈ నిధుల విషయంలోనే తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తి.. చివరకు అది ఉర్జిత్‌ రాజీనామాకూ దారితీసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత ఉర్జిత్‌ స్థానంలో వచ్చిన శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బీఐ బోర్డు.. అదనపు నిధుల విషయంలో సమీక్ష చేయడానికి కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని ఆ కమిటీ సిఫారసుల మేరకే తాజాగా సోమవారం జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఈ నిధుల బదిలీకి ఆమోదం లభించింది. దీంతో ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి రూ.1,76,051 కోట్ల అ‘ధనం’ బదిలీ కావడానికి మార్గం సుగమం అయింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలైన ఈ తరుణంలో ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడానికి ఈ నిధులు వీలు కల్పించే అవకాశం ఉంది.

 

(Courtacy Eenadu)

Leave a Reply