- కొవిడ్ మరణాలకు ఎక్స్‌గ్రేషియా.. భవిష్యత్తులోనూ వర్తించేలా నిబంధనలు
- రాష్ట్రాలే ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి చెల్లిస్తాయి
- దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా మంజూరు
- ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాకొక ప్రత్యేక కమిటీ
- ఎన్‌డీఎంఏ సిఫారసులను సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్రం
- రాష్ట్రంలో కొవిడ్ మరణాలు 3908
- అనధికారికంగా ఇంతకు వందల రెట్లలో మృతులు
న్యూఢిల్లీ : కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ) సిఫార సు చేసినట్లు బుధవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభు త్వం నివేదించింది. కొవిడ్ కట్టడి చర్యలు, ఉపశమన కార్యక్రమాల్లో పాల్గొనగా వైరస్ సోకడంతో చనిపోయి న వారి కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వొచ్చని పేర్కొంది. ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మం డలి(ఐసీఎంఆర్) మార్గదర్శకాలకు అనుగుణంగా కొవి డ్ నిర్ధారణ అయితేనే సాయం అందుతుందని స్పష్టం చేసింది. ఎక్స్‌గ్రేషియాలను రాష్ట్రాలు వాటి విపత్తు స్పందన నిధి(ఎస్‌డీఆర్‌ఎఫ్) నుంచి చెల్లిస్తాయని తెలిపింది. భవిష్యత్తులో ఏవైనా కొవిడ్ మరణాలు సంభవించినా ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే ప్రత్యేక దరఖాస్తుపత్రాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు విజ్ఞప్తులు సమర్పించవచ్చని సర్కారు తెలిపింది. ధ్రువపత్రాలన్నీ అందిన 30 రోజుల్లోగా దరఖాస్తును పరిష్కరించి, లబ్ధిదారుడి ఆధార్ నంబర్ అనుసంధానిత బ్యాంకు ఖాతాకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బదిలీ చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఫిర్యాదులను అదనపు జిల్లా కలెక్టర్, వైద్య విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓహెచ్), అదనపు సీఎంఓహెచ్, స్థానిక మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ విభాగాధిపతిల కమిటీ పరిశీలిస్తుంది.
4 వారాలకే కొవిషీల్డ్ రెండో డోసు?
కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్నాక 12-16 వారాల్లోగా రెండో డోసు తీసుకోవాలనే నిబంధన అమ ల్లో ఉంది. ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో కొవిషీల్డ్ తీసుకున్న వారికి 4 వారాల తర్వాత రెండో డోసు తీసుకునే అవకాశం కల్పించాలని సర్కారు యోచిస్తోంది.
కాగా, దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6 నెలల కనిష్ఠానికి తగ్గి 3,01,989కి చేరింది. 26,964 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లు దాటింది. మరో 383 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 4.45 లక్షలకు చేరింది. బెంగళూరులో శిక్షణ పొందుతున్న 34 మంది బీఎ్‌సఎఫ్ జవాన్లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచారు.
టీకా ధ్రువపత్రంతోనే సమస్య: బ్రిటన్
భారత్‌లో టీకాలకు ఇచ్చే ధ్రువపత్రంతోనే సమస్య తప్ప కొవిషీల్డ్ టీకాతో కాదని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) అధికారులు చెప్పారు. అయితే, అనుమతించే టీకాల జాబితాలో కొవిషీల్డ్‌ను చేర్చింది. నిబంధనల మినహాయింపు దేశాల జాబితాలో మాత్రం భారత్‌ను చేర్చకపోవడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. మొత్తం 17 దేశాల ప్రయాణికులకు తమ తాజా మార్గదర్శకాల నుంచి బ్రిటన్ మినహాయించింది. వారికి క్వారంటైన్ అవసరం లేదని తెలిపింది. భారత్‌లో టీకా ధ్రువపత్రాలను కొవిన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా జారీ చేస్తున్నారు. కొవిన్‌లో కొవిడ్ ధ్రువపత్రాల జారీలో సమస్యలు లేవని జాతీయ ఆరోగ్య సంస్థ సీఈవో ఆర్‌ఎస్ శర్మ తెలిపారు.
కాగా, ఒంటెల్లా ఉండే లామాల నుంచి సేకరించిన కొవిడ్ యాంటీబాడీలను కరోనా సోకిన జంతువులపై పరీక్షించగా సానుకూల ఫలితాలొచ్చాయి. లామాల యాంటీబాడీలు కరోనా వైర్‌సకు బలంగా పెనవేసుకుపోయి ఇన్ఫెక్షన్‌ను నిలువరిస్తున్నట్లు గుర్తించారు. లామాల నానో యాంటీబాడీలను నెబ్యులైజర్ లేదా నేసల్ స్ర్పే ద్వారా నేరుగా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశపెట్టొచ్చన్నారు.
రాష్ట్ర సర్కారు చెల్లించాల్సింది రూ.19.54 కోట్లు
హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో కొవిడ్‌తో 3908 మంది మరణించారు. రూ.50 వేలు చొప్పున మృతుల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు రూ.19.54 కోట్లు చెల్లించాల్సి ఉం టుంది. జాతీయ విపత్తుల నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏటా రూ.600 కోట్లు ఇస్తోంది. ఈ నిధుల నుంచే కొవిడ్ మృ తుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తారు. రాష్ట్రంలో కొవిడ్‌తో 3908 మందే మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నా యి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు అనేక వందల రెట్లు మరణాలు సంభవించాయి. సర్కారు వాటన్నింటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది బహిరంగ రహస్యం.
Courtesy Andhrajyothi