బస్సులో బాదుడు

0
356
  • సామాన్యుల నెత్తిన చార్జీల పిడుగు
  • మొన్న కిలోమీటరుకు 20 పైసలు
  • నిన్న టికెట్‌ కనీస చార్జీల సవరణ
  • తాజాగా రౌండ్‌ ఫిగర్లుగా చార్జీలు
  • 800 కోట్లపైనే ప్రజలపై భారం
  • బస్‌ పాస్‌ల ధరలు కూడా పెంపు
  • చార్జీలు మూడేళ్లకు; పాస్‌లు ఆరేళ్లకు
  • తెలంగాణ వచ్చాక రెండోసారి పెంపు
  • ఇక నుంచి కనీస చార్జీ రూ.10
  • అర్ధరాత్రి నుంచే చార్జీలు అమల్లోకి

షిర్డీ వెళ్లాలని ప్రయాణం పెట్టుకున్నారా!?
ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.365 సిద్ధం చేసుకోండి. ఎందుకంటే, హైదరాబాద్‌ నుంచి షిర్డీకి ఇప్పటి వరకూ రూ.1245 చార్జీ ఉండేది.
ఇప్పుడు దీనిని రూ.1610 చేశారు.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు 569 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ గరుడ-ప్లస్‌లో రూ.1,010 చార్జీ వసూలు చేసేవారు. మంగళవారం నుంచి టీఎస్‌ఆర్టీసీ రూ.1,290 వసూలు చేయబోతోంది. అదనంగా రూ.280 పిండుకోబోతోంది.

హైదరాబాద్‌-వికారాబాద్‌ (చేవెళ్ల మీదుగా) 76 కిలోమీటర్ల ప్రయాణానికి పల్లె వెలుగు బస్సులో రూ.50 చార్జీ ఉండేది. ఇప్పుడది రూ.66 అయింది.

సిద్దిపేట నుంచి హన్మకొండకు 84 కిలోమీటర్లు. పల్లె వెలుగులో ఇప్పటి వరకూ చార్జీ రూ.61. మంగళవారం నుంచి రూ.83 వసూలు చేయబోతోంది. అదనంగా రూ.22 చెల్లించడానికి సిద్ధంకండి.

హైదరాబాద్‌, డిసెంబరు 2 : ఎర్ర బస్సు ఎక్కుతున్నారా!? అయితే, చిల్లర కాదు.. మరిన్ని నోట్లు జేబులో వేసుకోండి! మీ పిల్లల బస్‌ పాస్‌లకు మరిన్ని డబ్బులు సర్దండి! మీ నెలవారీ బడ్జెట్లో ఆర్టీసీ చార్జీలకు కోటా భారీగా పెంచండి. చిల్లర గురించి గాబరా పడకండి. చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేసేశారు! మొన్న.. కిలోమీటరుకు 20 పైసల చొప్పున చార్జీలు పెంచారు. నిన్న.. కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. నేడు.. చార్జీలను రౌండ్‌ ఫిగర్‌ చేసేశారు. వెరసి, బస్సు ప్రయాణికుడిపై భారీగా వడ్డించారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. పల్లె వెలుగు నుంచి గరుడ ప్లస్‌ వరకూ అన్ని బస్సుల్లోనూ చార్జీలు పెరిగాయి. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ చార్జీల పెంపు ఇది రెండోసారి. చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని 2016 నుంచి ఆర్టీసీ పలుమార్లు కోరుతోంది. కానీ, ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే.. ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి 45 డిమాండ్లతో కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. వారు సమ్మె విరమించిన తర్వాత ఎట్టకేలకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడానికి సర్కారు అంగీకరించింది. విధుల్లో చేర్చుకోవడానికి వారిని అనుమతిస్తూనే.. పనిలో పనిగా బస్‌ చార్జీలను 20 పైసల చొప్పున పెంచుకోవడానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కనీస చార్జీ.. తాజాగా రౌండ్‌ ఫిగర్‌ చేయడంతో ఆర్టీసీకి వచ్చే అదనపు ఆదాయం రూ.800 కోట్లను దాటుతుందని అంచనా. తద్వారా, ఆర్టీసీ క(న)ష్టాల భారాన్ని ప్రజలపైకి నెట్టేసినట్లయింది.

అన్ని రకాల సర్వీసుల్లో పెరుగుదల
ఆర్టీసీలో ఉన్న దాదాపు అన్ని రకాల సర్వీసుల చార్జీలు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల వంటి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల చార్జీలను కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచారు. గ్రామీణ ఆర్డినరీ (పల్లె వెలుగు), సిటీ ఆర్డినరీ బస్సు చార్జీలు ‘ఫేర్‌ స్టేజీ’ల ఆధారంగా పెరిగాయి. పెరిగిన చార్జీలకు టోల్‌ ప్లాజా టారిఫ్‌, పాసింజర్‌ సెస్‌, ఇతర సదుపాయాల చార్జీలు, ఏసీ సర్వీసులపై జీఎస్టీని కలిపి ఫైనల్‌ చార్జీలను నిర్ధారించారు.

చార్జీలన్నీ రౌండ్‌ ఫిగర్‌
బస్సు ఎక్కి ఇక చిల్లర గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు. పల్లె వెలుగు నుంచి గరుడ ప్లస్‌ వరకూ చార్జీలన్నిటినీ సర్కారు రౌండ్‌ ఫిగర్‌ చేసేసింది. ఉదాహరణకు.. రూ.20, రూ.25, రూ.30గా ఉండనున్నాయి. పిల్లలకు సంబంధించిన సగం చార్జీలను కూడా టికెట్‌ ఇష్యూయింగ్‌ మిషన్స్‌ (టీమ్స్‌)లో తదుపరి రౌండ్‌ ఫిగర్లకు ఫిక్స్‌ చేశారు. నిజానికి, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ/సిటీ సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో చిల్లర సమస్య కారణంగా 2018లో చార్జీలను రౌండ్‌ ఫిగర్లుగా మార్చారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తం చేశారు.

నగరంలో ఏసీ బస్సులకు ఊరట
నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుత చార్జీలకు అదనంగా రూ.5 పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ మినహా మిగిలిన బస్సుల్లో కనీస చార్జీ పెంచారు. సిటీలో అమల్లో ఉన్న వివిధ బస్‌పాస్‌లతోపాటు స్టూడెంట్‌ పాస్‌ ధరలు కూడా పెరిగాయి. ఏసీ బస్సుల్లో టికెట్‌ ధరలను పెంచకపోగా, తగ్గించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజంతా తిరిగే ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌ టికెట్‌ ధర రూ.80 నుంచి రూ.100 చేశారు.

కనీస చార్జీ రూ.10
పల్లె అయినా పట్టణమైనా కనీస చార్జీ ఇక రూ.10 . పల్లె వెలుగులో కనీస చార్జీ ఇప్పటి వరకూ రూ.6 ఉండేది. దానిని రూ.10కి పెంచారు. అలాగే, సిటీ ఆర్డినరీ కనీస చార్జీని రూ.5 నుంచి 10కి పెంచారు. నగరంలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌కు సంబంధించి 20 స్టేజీల వరకు కొత్త చార్జీలను నిర్ధారించారు. కాగా, పల్లె వెలుగు బస్సులకు 5 కిలోమీటర్లకు ఒక ‘ఫేర్‌ స్టేజీ’ ఉంది. అదే నగరంలోని ఆర్డినరీ సర్వీసులకు 2 కిలోమీటర్లకు ఒక ‘ఫేర్‌ స్టేజీ’ ఉంది. వీటి ధరలు పెంచలేదు.

చార్జీల పెంపు.. ముఖ్యాంశాలు

  • నగరంలో నడిచే మెట్రో లగ్జరీ, సిటీ షీతల్‌ వంటి ఏసీ బస్సుల చార్జీలను పెంచలేదు. వీటిని త్వరలో పెంచుతారు.
  • జాతరలు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్‌ సర్వీసులకు చార్జీలపై ఒకటిన్నర రెట్ల వరకు పెంచి వసూలు చేస్తారు.
  • ప్రస్తుతం పెంచిన చార్జీలన్నింటినీ టీఎ్‌సఆర్టీసీ నడిపే అంతర్రాష్ట్ర సర్వీసుల్లోనూ అమలు చేస్తారు.
  • క్యాట్‌ కార్డుల వ్యాలిడిటీ ఉన్నంత వరకు 10 శాతం రాయితీతో అనుమతిస్తారు.

జిల్లాలో నడిచే పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల ప్రస్తుత, కొత్త చార్జీలు (రూ.లలో)
రూటు ప్రస్తుతం కొత్త చార్జీ

సిద్దిపేట-హన్మకొండ 61 83

జేబీఎస్‌-గజ్వేల్‌ 41 54
సంగారెడ్డి-పటాన్‌చెరు 16 21
హన్మకొండ-నర్సంపేట 29 35
హన్మకొండ-ఖమ్మం 82 105
ఆదిలాబాద్‌-నిర్మల్‌ 58 76
నిర్మల్‌-నిజామాబాద్‌ 49 64
ఖమ్మం-కోదాడ 24 34
హైదరాబాద్‌-వికారాబాద్‌ 50 66
హైదరాబాద్‌-కల్వకుర్తి 61 80

హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఇతర గమ్యస్థానాలకు ప్రస్తుత ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు, పెరిగిన చార్జీలు (రూ.లలో)

గరుడ ప్లస్‌(ఏసీ)
రూటు ప్రస్తుతం కొత్త చార్జీ
హైదరాబాద్‌-బెంగళూరు 1010 1290
హైదరాబాద్‌-పుణె 1305 1500
హైదరాబాద్‌-షిరిడీ 1245 1610
హైదరాబాద్‌-తిరుపతి 1130 1170
హైదరాబాద్‌-విజయవాడ 570 620

సాధారణ ప్రయాణికులు, రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగుల నెలవారి జనరల్‌ బస్‌ పాసుల టారిఫ్‌(రూ.లలో)
ప్రస్తుత టారిఫ్‌ కొత్త టారిఫ్‌
జీబీటీ-ఆర్డినరీ 770 950
జీబీటీ-మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 880 1070
జీబీటీ-మెట్రో డీలక్స్‌ 990 1185

పట్టణాలు/నగరాల్లో విద్యార్థి
బస్‌ పాసుల త్రైమాసిక టారిఫ్‌(రూ.లలో)
కిలో మీటర్లు ప్రస్తుతం కొత్త టారిఫ్‌
4 కిలో మీటర్ల లోపు 130 165
8 కిలో మీటర్ల లోపు 160 200
12 కిలో మీటర్ల లోపు 225 280
22 కిలో మీటర్ల లోపు 265 330

హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఇతర గమ్యస్థానాలకు
ప్రస్తుత ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు, పెరిగిన చార్జీలు (రూ.లలో)
ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ లగ్జరీ రాజధాని(ఏసీ) గరుడ ప్లస్‌(ఏసీ)
రూటు ప్రస్తుతం కొత్త చార్జీ ప్రస్తుతం కొత్త చార్జీ ప్రస్తుతం కొత్త చార్జీ ప్రస్తుతం కొత్త చార్జీ
జేబీఎస్‌-కరీంనగర్‌ 148 180 195 230 269 310 330 370
హైదరాబాద్‌-హన్మకొండ 130 170 185 215 260 290 310 350
హైదరాబాద్‌-నిజామాబాద్‌ 174 210 232 270 294 330
హైదరాబాద్‌-ఖమ్మం 179 220 238 280 326 370 400 440
హైదరాబాద్‌-నిర్మల్‌ 220 270 290 345 363 445
హన్మకొండ-బెంగళూరు 884 1045 1049 1350 1303 1602
ఖమ్మం-భద్రాచలం 110 135 146 175 208 220

ఎన్‌జీఓల నెలవారి బస్‌ పాసుల టారిఫ్‌(రూ.లలో)
ప్రస్తుత టారిఫ్‌ కొత్త జీబీటీ –
టారిఫ్‌ ఆర్డినరీ
జీబీటీ-ఆర్డినరీ 260 320
జీబీటీ-మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 370 450
జీబీటీ-మెట్రో డీలక్స్‌ 480 575
ఎంఎంటీఎస్‌-
ఆర్టీసీ కాంబీ టికెట్‌ 880 1090
సిటీ-మెట్రో కాంబీ టికెట్‌ 10 10
జిల్లా విద్యార్థుల
కాంబీ టికెట్‌ 10 20
ట్రావెల్‌ యాజ్‌ యూ
లైక్‌ టికెట్‌(నాన్‌ ఏసీ) 80 100

గ్రామీణ ప్రాంత హైస్కూలు, కాలేజీ విద్యార్థి బస్‌ పాస్‌ల నెలవారి టారిఫ్‌ (రూ.లలో)
కిలో మీటర్లు ప్రస్తుతం కొత్త టారిఫ్‌
5 కిలో మీటర్ల లోపు 85 115
10 కిలో మీటర్ల లోపు 105 140
15 కిలో మీటర్ల లోపు 135 180
20 కిలో మీటర్ల లోపు 180 240
25 కిలో మీటర్ల లోపు 225 300
30 కిలో మీటర్ల లోపు 250 330
35 కిలో మీటర్ల లోపు 270 355

జిల్లాల్లో తిరిగే వివిధ సర్వీసుల్లో పెరిగిన కనీస చార్జీల వివరాలు
సర్వీసు మొదటి స్టేజీ
నుంచి రెండో స్టేజీకి
కనీస చార్జీ
పల్లె వెలుగు రూ. 10
సెమీ లగ్జరీ రూ. 10
ఎక్స్‌ప్రెస్‌ రూ. 15
డీలక్స్‌ రూ. 20
సూపర్‌ లగ్జరీ రూ. 25
రాజధాని/వజ్ర ఏసీ రూ. 35
గరుడ ఏసీ రూ. 35
గరుడ-ప్లస్‌ ఏసీ రూ. 35
వెన్నెల(ఏసీ స్లీపర్‌) రూ. 70

గ్రామీణ ప్రాంత హైస్కూలు, కాలేజీ
విద్యార్థి పాసుల త్రైమాసిక టారిఫ్‌ (రూ.లలో)
కిలో మీటర్లు ప్రస్తుతం కొత్త టారిఫ్‌

5 కిలో మీటర్ల లోపు 235 310
10 కిలో మీటర్ల లోపు 315 415
15 కిలో మీటర్ల లోపు 385 510
20 కిలో మీటర్ల లోపు 510 675
25 కిలో మీటర్ల లోపు 645 850
30 కిలో మీటర్ల లోపు 705 930
35 కిలో మీటర్ల లోపు 775 1025

బస్‌ పాస్‌ల టారిఫ్‌ బాదుడు
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ బస్‌ పాస్‌ల కోసం మరింత ఖర్చు చేయాల్సిందే. జిల్లాలు, నగరాల్లోని బస్సులన్నిటిలో పాస్‌ల టారి్‌ఫలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కిలోమీటర్లలోపు స్టూడెంట్‌ జనరల్‌ బస్‌ టికెట్‌ నెలకు ప్రస్తుతం రూ.130 ఉంటే.. ఇది రూ.165కు పెరిగింది. త్రైమాసిక టికెట్‌ ధర రూ.390 నుంచి రూ.495కు పెరిగింది. గ్రామీణ ప్రాంత హైస్కూలు, కాలేజీ విద్యార్థుల త్రైమాసిక పాస్‌ల టారిఫ్‌ రూ.75 నుంచి రూ.250 వరకూ పెరిగింది. సాధారణ ప్రయాణికులు నెలవారీ జనరల్‌ బస్‌ పాస్‌ తీసుకుంటే ఇప్పటి వరకూ ఆర్డినరీ బస్సుకు రూ.770 చెల్లించాల్సి ఉండేది. ఇకనుంచి రూ.950 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఎన్జీవోల నెలవారీ బస్‌ పాస్‌ల టారిఫ్‌ కూడా పెంచారు. చివరికి, ట్రావెల్‌ యాజ్‌ యు లైక్‌ టికెట్‌ (నాన్‌ ఏసీ) ధరను కూడా రూ.20 పెంచారు.

Courtesy Andhajyothi…

Leave a Reply