ప్రగతి భవన్‌ ఎదుట కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం

0
236

  • మెదక్‌లో పురుగుల మందు తాగిన మరో కండక్టర్‌
  • గుండెపోటుతో మెహదీపట్నం డిపో డ్రైవర్‌ మృతి

బర్కత్‌పుర: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా విధుల్లో చేర్చుకోవడానికి అధికారులు అనుమతించకపోవడంతో మానసిక వేదనకు గురైన ఇద్దరు ఆర్టీసీ కండక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మెహదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న చంద్రమోహన్‌ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం(ప్రగతి భవన్‌) ఎదుట తన ఒంటి మీద పెట్రోల్‌ పోసుకున్నాడు. నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెదక్‌ డిపోలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న మైసయ్య బుధవారం పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఉద్యోగం పోతుందేమోనన్న బాధతో వెంకటరాజం అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో చనిపోయాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా బీంపల్లికి చెందిన పసుల వెంకటరాజం(35) మెహిదీపట్నం డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Courtesy AndhraJyothy…

Leave a Reply