మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్‌

0
296

మాస్కో : కోవిడ్‌-19 కట్టడికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ మార్కెట్లో విడుదలైంది. రష్యా గమాలియా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎపిడిమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ రష్యా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ‘తొలివిడత టీకా డోసులు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి’ అని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

రష్యా తన వ్యాక్సిన్‌ను భారత్‌లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్టుగా నీతి అయోగ్‌ సభ్యుడు వి.కె. పాల్‌ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్‌ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్‌పైన్స్‌ వంటి దేశాలు రష్యా టీకాకు అనుమతులు మంజూరు చేశాయి.

Courtesy Sakshi

Leave a Reply