పులిచింతలకు రెండు నెలల్లో దారి

0
249

ప్రాజెక్టు వద్ద వైఎస్‌ స్మారక వనం, 45 అడుగుల విగ్రహం
జగ్గయ్యపేటకు వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం
జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
ప్రజాశక్తి-అచ్చంపేట (గుంటూరు జిల్లాబెంబేలెత్తిస్తున్న ఇసుక ధరలు
ట్రాక్టర్‌ ఇసుక రూ.6వేలు పై మాటే
అయినా దొరకని వైనం
నెల రోజులైనా ప్రారంభం కాని ఆన్‌లైన్‌ అమ్మకాలు

‘రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ ప్రారంభించాలి’. నాలుగు రోజుల క్రితం అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాలు. కానీ, విజయనగరం జిల్లాలో గత నెల రోజులుగా ఇసుక అమ్మకాలు ప్రారంభం కాలేదు. ఇదే అదనుగా అక్రమార్కులు ఇసుకను అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుక ధర రూ.6 వేల దాటిపోవడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. టిడిపి ప్రభుత్వంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.2,500 నుంచి రూ.3 వేలు మధ్య దొరికేది. ఉచిత ఇసుక విధానంలోనూ ట్రాక్టర్‌ ఇసుక రూ.3 వేలుకు కొనుగోలు చేయడం అప్పట్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన వైసిపి గతంలోని ఇసుక ధరలను సాకుగా చూపించి నూతన ఇసుక విధానాన్ని తెచ్చింది. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఇసుక అందుబాటులోకి రాకపోగా, ప్రభుత్వమే అధిక ధరలకు చట్టబద్ధత చేసింది. ఫలితంగా ఇసుక ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
నూతన ఇసుక విధానం ప్రకారం జిల్లాలో ఇసుక తవ్వకాలకు రీచ్‌లు లేవు. దీంతో జిల్లా అవసరాలకు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల నుంచి ఇసుకను తెచ్చి డెంకాడ, బొబ్బిలి (గొర్లె సీతారాంపురం) స్టాక్‌ పాయింట్లలో అధికారులు నిల్వ చేయాలి. కానీ, వర్షాల కారణంగా నదులు ప్రవహిస్తుండడంతో అక్కడ నుంచి కూడా ఇసుక రావడం లేదు. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభానికే నోచుకోలేదు. ప్రస్తుతం ఇసుక బుకింగ్‌ కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తే, స్టాక్‌ లేదని చూపిస్తోంది. పోనీ ప్రయివేటు వ్యాపారుల వద్ద ఇసుకను కొందామంటే వారు ధరలను రెట్టింపు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెంకాడ, బొబ్బిలి స్టాక్‌ పాయింట్ల వద్ద ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.4,523 నుంచి రూ. 5,184గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్‌ ఇసుక ధర గ్రామీణ ప్రాంతంలో రూ.6 వేలు, పట్టణాల్లో రూ.8 వేలుపైనే అమ్ముతున్నారు. లారీ ఇసుక ధర రూ.15 వేలు కాగా, ఏడు యూనిట్ల లారీ ధర రూ.రూ.50 వేలకు చేరిపోయింది. అధిక ధరలైనా ఇసుక దొరకని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లాలో ఇసుక కష్టాలు వినియోగదారులకు, భవన నిర్మాణ కార్మికులను కన్నీరు పెట్టిస్తున్నాయి.

ఉపాధిని కాజేసింది
జిల్లాలో ఇసుక దొరకడం లేదు. గెడ్డల్లో, వాగుల్లో దొరికిన ఇసుకకు రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. వాటిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఒక పనిలో మిగిలిన ఇసుకను కూడా తరలించనివ్వడం లేదు. ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయి పనులు లేకుండా పస్తులుండాల్సిన పరిస్ధితి ఎదురైంది.
ఎం.నాగరాజు, మేస్త్రి, నర్సిపురం

కొనలేని పరిస్థితి
ఇసుకను కొనలేని పరిస్థితి దాపురించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించు కోవ డం లేదు. గత నాలుగు మాసా లుగా ఇబ్బందులు పడు తున్నాం. ఇప్పటికే అనేకసార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదు. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని ఇసుకను అందుబాటులోకి తేవా లి. లేదా ప్రయివేటు ధరలనైనా అదుపు చేయాలి.
జి. సూర్యనారాయణ, భవన నిర్మాణ కార్మికుడు, పార్వతీపురం

స్టాకు లేదు
ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డెంకాడ, బొబ్బిలి స్టాక్‌ పాయింట్లు వద్ద స్టాక్‌ లేదు. శ్రీకాకుళం నుంచి రావాల్సిన ఇసుక వర్షాల కారణంగా రాలేదు. త్వరలోనే జిల్లాలో రైతుల పట్టా భూముల నుంచి ఇసుక కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
వెంకటరమణ, ఎపిఎంఐడి పిఒ జగ్గయ్యపేట రూరల్‌, కృష్ణాజిల్లా)

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడంతోపాటు ఇతర వసతులూ లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రెండు నెలల్లో రహదారి నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధుల వసతికి ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. అచ్చంపేట మండల ప్రజల కోరిక మేరకు జగ్గయ్యపేట వెళ్లడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణానికీ శంకుస్థాపన చేస్తామన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులోని పులిచింతల ప్రాజెక్టును జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, జోగి రమేష్‌తో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ప్రాజెక్టులో 54 అడుగుల నీరు నిల్వ ఉండడంతో జలహారతి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులూ, చెరువులూ జలకళను సంతరించుకున్నాయన్నారు.

వైఎస్‌ స్మృతివనం ఏర్పాటుకు పరిశీలన
పులిచింతలకు 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసే సమయంలోనే కొందరు వ్యతిరేకించారని, అయినా దీని ప్రాధాన్యతను గుర్తించి ఆయన ముందుకెళ్లారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్సార్‌ విగ్రహం, వైఎస్సార్‌ స్మారకవన ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని మంత్రి తెలిపారు. దీంతోపాటు ప్రాజెక్టు రూపకల్పన చేసిన కెఎల్‌ రావ్‌ విగ్రహం ఏర్పాటుకు కూడా స్థలాన్ని పరిశీలించామన్నారు.

Courtesy Prajashakthi…

Leave a Reply