మా అమ్మాయిలకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

0
279

పతకమే కాంస్యం కానీ..ఆట మాత్రం బంగారమే! ఇదీ టోక్యో ఒలింపిక్స్‌ స్టేడియంలో పి.వి.సింధు ఆటను చూసిన ప్రతి ప్రేక్షకుడు మాట్లాడిన మాట! తెల్లరంగు బ్లేజర్‌.. ఎడం చేతికి ఎర్రతాడు, బంగారు కడియం… కుడిచేతి గోళ్లకు ఒలింపిక్స్‌ గుర్తుల నెయిల్‌ పాలిష్‌తో ఈ షట్లర్‌  హైదరాబాద్‌లోని తన సొంతింట్లో కూల్‌గా కనిపించింది. కరోనా నేపథ్యంలో ఎన్నో ప్రతికూలతల మధ్య ఒలింపిక్స్‌లోకి అడుగెట్టి.. కాంస్యం గెలుచుకున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింఽధు తన అనుభవాలను, సవాళ్లను  పంచుకుందిలా..

పతకం గెలిచాక  మొదటగా ఎవరికి ఫోన్‌ చేశారు?
అమ్మానాన్నకు ఫోన్‌ చేశా. వాళ్ల ఆనందానికి హద్దులు లేవు. అంతకు ముందు రోజు సెమీస్‌ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్లకే ఫోన్‌ చేశా.. ‘ఏం పర్వాలేదు..’ అన్నారు. నా ఆటను మెచ్చుకున్నారు. ఓడిపోయిన నిరాశలో ఉన్న నాకు వాళ్ల మాటలు టానిక్‌లా పనిచేశాయి. నిజానికి వాళ్లకు నా మీద ఉన్న నమ్మకం చాలా గొప్పది. కచ్చితంగా పతకం సాధిస్తాననే నమ్మకం వాళ్లకు ఉంది.

ఈ ఒలింపిక్స్‌లో మీరు ఏం  నేర్చుకున్నారు?
ఆడిన ప్రతి టోర్నమెంట్‌ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. ఈ సారి నేను ఒత్తిడిని జయించగలిగా. 2016తో పోలిస్తే- ఈ సారి నాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా ఉన్నాయి. దాని వల్ల ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిని నేను జయించగలిగా. అయితే ఈ సారి ఒలింపిక్స్‌లో స్టేడియంలో అభిమానులను మిస్సయ్యా! స్టేడియంలో అభిమానులు సందడి చేస్తుంటే ఆ కిక్‌ వేరు. కోవిడ్‌ వల్ల అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక కొత్త అనుభవమే!

మీ దృష్టిలో ఈ సారి ఒలింపిక్స్‌ ప్రత్యేకతేమిటి?
కోవిడ్‌ సమయంలో ఒలింపిక్స్‌ను నిర్వహించటం ఒక గొప్ప విషయం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ఆటగాళ్లను, కోచ్‌లను.. సపోర్ట్‌ స్టాఫ్‌ను జాగ్రత్తగా చూడటం.. వారికి ఆతిథ్యం ఇవ్వటం అంత సులభం కాదు. జపనీయుల పనితనం, మేనేజిమెంట్‌, క్రమశిక్షణలను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ సారి ఒలింపిక్స్‌లో అమ్మాయిలే పతకాలు సాధిస్తున్నారు.. మీకేమనిపిస్తోంది?
నిజమే కదా.. ఒక అమ్మాయిగా చాలా గర్వంగా ఉంది. ఆనందంగా కూడా ఉంది. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలూ కష్టపడతారు.. అనే విషయం మరో సారి రుజువు అయింది. దేశం కోసం మా వంతు పోరాడి పతకాలు సాధించాం.

ఒకప్పుడు అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు.. ఉద్యోగాలు చేయకూడదు అనే భావనలు ఉండేవి. వాటి నుంచి బయటకు రావటం అంత సులభం కాదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి అంతర్జాతీయ పోటీల్లో నిరూపించుకుంటున్నామంటే – సామాన్యమైన విషయం కాదు. మేము చాలా సాధించాం. మాకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే!

ఈ సారి మిమల్ని బాగా ఒత్తిడికి గురిచేసిన విషయాలేమైనా ఉన్నాయా?
ఆటల్లో ఒత్తిడి సామాన్యమే. ఒలింపిక్‌ స్థాయి ఆటల్లో ఈ ఒత్తిడి మరింత ఉంటుంది. ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోతే పతకం చేజారిపోతుంది. ఆ ఒక్క క్షణం కూడా ఏకాగ్రతతో పోరాడాలంటే అందరి మద్దతు అవసరం. నాకు అందరూ అలాంటి మద్దతు ఇచ్చారు.

అయితే, ఆన్‌లైన్ Slotogate గేమింగ్‌ను మీ దినచర్యలో చేర్చడం ద్వారా, మీరు పోటీ గేమింగ్‌తో సంబంధం ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే వినోదం మరియు విశ్రాంతి యొక్క మూలాన్ని కనుగొనవచ్చు.

మానసికంగా ఉండే ఒత్తిడిని ఎలా అధిగమించారు?
ఈ సారి టూర్‌కు అమ్మానాన్న రాలేదు. అయినా నేను మానసికంగా ఒత్తిడికి గురికాలేదు. ఎందుకంటే ఒలింపిక్స్‌ ప్రతి నాలుగేళ్లకు ఒక సారి వస్తాయి. వాటిలో గెలవాలంటే – ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా ఆడాల్సిందే. గతంలో నేను ఆడిన మ్యాచ్‌లలోని అనుభవాలు, ఇబ్బందులు నన్ను రాటుదేల్చాయి. ఎన్ని భావోద్వేగాలున్నా- కోర్టులోకి అడుగుపెట్టగానే- మర్చిపోయేలా చేస్తాయి. ఈ సారి సెమీస్‌లో ఓడిపోయినప్పుడు కూడా కొద్ది సేపు బాధపడ్డా. ఆ తర్వాత సైర్థ్యం తెచ్చుకున్నా. ఆ మర్నాటి మ్యాచ్‌కు సిద్ధమయ్యా.

గెలుపు ఓటమిలను మీరు ఎలా నిర్వచిస్తారు?
అందరూ గెలుపు కోసమే ప్రయత్నిస్తారు. కష్టపడి సాధన చేయటం. ఏకాగ్రతతో ఆడటం మాత్రమే మనం చేయగలం. కొన్ని సార్లు మనకు కాలం కలిసిరాదు. ఓడిపోతాం. అలాంటి ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఒక సారి చేసిన తప్పులు మళ్లీ చేయకూడదు.

మీరు కాంస్యం సాధించాక ‘ఈ హైదరాబాద్‌ నేలలో ఏదో మహత్తుంద’ని హర్షాభోగ్లే ట్వీట్‌ చేశారు. మీరేమంటారు..
నిజమే! హైదరాబాద్‌ నేలలో ఏదో మహత్తు ఉంది. ఎంతో మంది గొప్ప ప్లేయర్స్‌ ఇక్కడ నుంచే వచ్చారు. పైగా నాకు హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే గొప్ప శక్తి వచ్చినట్లు ఉంటుంది.

ఈ తరం అమ్మాయిలకు మీరు ఏదైనా చెబుతారా?
ఈ తరం అమ్మాయిలు కష్టనష్టాలకు వెనకాడరు. వాళ్లకు నేను చెప్పేదొకటే.. ‘మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లక్ష్యాన్ని వదలద్దు.  అనుకున్నది సాధించేవరకు పోరాడండి.’

వచ్చే ఒలింపిక్స్‌కు బంగారమేనా..
ఇంకా చాలా సమయం ఉంది. అక్టోబర్‌నుంచి టోర్నమెంట్స్‌ ఉన్నాయి. వాటిలో బాగా ఆడాలి. ప్రస్తుతమైతే ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా.

‘‘ఎంత ఒత్తిడి ఉంటే అంత కూల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తా. మా అక్క కొడుకుతో ఆడుకుంటా! నాకో కుక్క ఉంది. దానితో ఆడతా..’’నా విజయం వెనక నా కోచ్‌ పార్క్‌ పాత్ర చాలా ఉంది. ఆయన నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మానసికంగా చాలా మద్దతు ఇచ్చారు. ఆయనకు నేను ఎప్పటికి రుణపడి ఉంటా. అలాంటి కోచ్‌లు ఉంటే ఇంకా ఎంతో మంది సింధులు వస్తారు.

Courtesy Andhrajyothi

Leave a Reply