ఎలా చేశారు?

0
302
 • మహారాష్ట్ర గవర్నర్‌ నిర్ణయాలపై ఆధారాలు కోరిన సుప్రీంకోరు
 • గవర్నర్‌ సిఫారసు లేఖ, ఫడణవీస్‌ మెజారిటీ లేఖ ఇవ్వండి
 • గడువు ఇచ్చేది లేదు.. నేటి ఉదయానికల్లా ఇవ్వాల్సిందే
 • వాటిని చూసిన తర్వాతే బల పరీక్షపై నిర్ణయం
 • అప్పటి వరకూ త్రిపక్షాల వినతినీ పరిగణనలోకి తీసుకోలేం
 • నేటి ఉదయం 10.30 గంటలకు తదుపరి విచారణ
 • ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టిన ధర్మాసనం
 • కేంద్రం, మహారాష్ట్ర, ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌కు నోటీసులు
 • గవర్నర్‌ది మోసం.. తన ఆఫీసును హాస్యాస్పదం చేశారు
 • 24 గంటల్లో బల నిరూపణకు ఆదేశించండి
 • లేదంటే మేం నిరూపించుకుంటాం
 • పిటిషనర్ల తరఫున కోర్టులో సిబల్‌, సింఘ్వి వాదనలు
 • గవర్నర్‌ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించజాలవు: రోహత్గీ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన రెండు లేఖలను సోమవారం ఉదయంలోగా తమకు సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. వాటిలో ఒకటి, రాష్ట్రపతి పాలనను ఎత్తి వేసి, దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానిస్తూ గవర్నర్‌ సిఫారసు చేసిన లేఖ కాగా.. మరొకటి తనకు మెజారిటీ ఉందంటూ గవర్నర్‌కు ఫడణవీస్‌ సమర్పించిన లేఖ. అదే సమయంలో, 24 గంటల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని దేవేంద్ర ఫడణవీ్‌సను ఆదేశించాలంటూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ చేసిన వినతిపై ఎటువంటి మధ్యంతర ఆదేశాలూ జారీ చేయలేదు. ఆ రెండు లేఖలనూ చూసిన తర్వాత మాత్రమే బల పరీక్షపై నిర్ణయం తీసుకోగలమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆ రెండు లేఖలనూ సమర్పించడానికి రెండు రోజులు సమయం కావాలంటూ సొలిసిటర్‌ జనరల్‌ పదే పదే కోరినా కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా చేపడతామని, అప్పటికల్లా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది.

 

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు సిఫారసు చేయాలన్న ప్రతిపక్షాల వినతిని కూడా పరిగణనలోకి తీసుకోలేమని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం స్ప ష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారుతోపాటు సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు నోటీసులు జారీచేసింది.సీఎంగా ఫడణవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌తో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రమాణం చేయించడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సెలవు రోజైనా పిటిషనర్ల వినతిపై సుప్రీం కోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. ఆ రెండు లేఖలను పరిశీలించిన తర్వాతే మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం లేదా తీర్పు ఇవ్వడం జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాతే తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

అంతకుముందు, వివిధ పక్షాల మధ్య కోర్టులో ఘాటుగా వాదోపవాదాలు జరిగాయి. ‘‘ఉదయం 5.17 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం అనాగరికం. కేబినెట్‌ సమావేశం నిర్వహించలేదు. దేని ఆధారం గా రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు గవర్నర్‌ సిఫారసు చేశారో స్పష్టత లేదు. ఉద యం 8 గంటలకే సీఎంగా ఫడణవీ స్‌, డిప్యూటీగా అజిత్‌ ప్రమాణ స్వీకారం చేసేశారు. ఇదంతా మిస్టరీగా ఉంది. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పా టు చేశారని చెప్పడానికి సంబంధించిన పత్రాలేవీ ప్రజలకు అందుబాటులో లేవు. నిజానికి, సభలో త్రిపక్షాలకే మెజారిటీ ఉంది. అందుకే 24 గంటల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఫడణవీ్‌సను ఆదేశించండి. అప్పుడు ఆయనకు బలం ఉందో లేదో తేలిపోతుంది’’ అని శివసేన తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఎన్సీపీ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సిం ఘ్వి వాదించారు.
గవర్నర్‌ కోశ్యారీ పక్షపాతంతో వ్యవహరించారని, గవర్నర్‌ కార్యాలయాన్ని ఆయన హాస్యాస్పదం చేశార ని అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాత్రి 7 గంటలకు ఎవరో ప్రకటిస్తే దాని ఆధారంగా చర్య లు తీసుకోవడం గవర్నర్‌ పక్షపాతమని, దురుద్దేశపూరితమని, ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధమని కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు. ‘‘ఈ రోజే బల పరీక్షకు ఆదేశించండి. బీజేపీకి మెజారిటీ ఉంటే అసెంబ్లీలోనే నిరూపించుకుంటుంది. లేకపోతే, మేం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. బలం నిరూపించుకునేందు కు గవర్నర్‌ నవంబరు 30 వరకూ గడువిచ్చారని, ‘ఇతరేతరాలకు’ పాల్పడడమే దీని ఉద్దేశమని తెలిపారు.
ఇది న మ్మక ద్రోహమని, ప్రజాస్వామ్యా న్ని నాశనం చేయడమేనని అన్నారు. ఆయన వాదనలను బీజేపీ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకు ల్‌ రోహత్గీ తప్పుబట్టారు. ‘‘అసలు ఆదివారం విచారణ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆదివారం ఎలాంటి విచారణ ఉండకూడదు’’ అన్నారు. అయినా, కపిల్‌సిబల్‌ తన వాదనకే కట్టుబడ్డారు. ‘‘మాకు మెజారిటీ ఉందని మేం చెబితే.. దానిని ప్రదర్శించడానికి సిద్ధం. రేపే మా మెజారిటీని నిరూపించుకుంటాం. కర్ణాటకలో ఇప్పటికే నిరూపించాం కూడా. వాళ్లకు మెజారిటీ ఉంటే నిరూపించుకొమ్మనండి’’అన్నారు. మెజారిటీ ఉందని తొలుత గవర్నర్‌ సంతృప్తి చెందాలని, ఇందుకు ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు ఉండాలని, భౌతిక పరిశీలన చేయాలని, పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని సింఘ్వి అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించి నా గవర్నర్‌ వేచి చూడలేరా? అని ప్రశ్నించారు.
కేవలం 42-43 మంది ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎం ఎలా అవుతారన్నారు. శాసనసభాపక్ష నేత పదవి నుంచి అజిత్‌ పవార్‌ను ఎన్సీపీ తొలగించిందని, బలం లేనప్పుడు ఆయ న డిప్యూటీ సీఎం పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలుంటే వారిలో 41 మంది శాసనసభాపక్ష నేత పదవి నుంచి అజిత్‌ను తొలగించామంటూ గవర్నర్‌కు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు ముకుల్‌ రోహత్గీ దీటుగా బదులిచ్చారు. కొన్ని అంశా లు రాష్ట్రపతి విచక్షణపై ఆధారపడి ఉంటాయని, వాటి విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోజాలవని అన్నారు. ఫడణవీస్‌ మెజారిటీని నిరూపించుకోవడానికి తొందరేమీ లేదన్నారు. ‘‘నిన్న గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏ కోర్టులూ ప్రశ్నించజాలవు. తన చర్యలకు గవర్నర్‌ ఎవరికీ జవాబుదారీ కాదు. ఆర్టికల్‌ 361 ప్రకారం గవర్నర్‌కు రాజ్యాంగ రక్షణ ఉంది. ఏ పార్టీని ఆహ్వానించాలో ఆయన ఇష్టం. గవర్నర్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోజాలరు’’ అని తేల్చి చెప్పారు.
వినతులకు ఆకాశమే హద్దు
ప్రభుత్వ ఏర్పాటుకు ఫలానా వాళ్లను ఆహ్వానించాలని గవర్నర్‌ను ఆదేశించాలని పిటిషనర్లు విన్నవించారని, అది విన తా? అని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు. దాంతో, వినతులకు ఆకాశమే హద్దు అని జస్టిస్‌ ఎన్వీ రమణ చమత్కరించారు. ‘నన్ను ప్రధాన మంత్రిని చేయండి అని ఓ సామాన్యుడు కూడా కోరవచ్చు’ అన్నారు. ఆదివారం కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టడంతో వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు కోర్టుకు హాజరయ్యారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఫడణవీ్‌సతో అజిత్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను శివసేన నేత సంజయ్‌ రౌత్‌ కలిశారు.
’1978’ పునరావృతం… నాడు శరద్‌ పవార్‌.. నేడు అజిత్‌ పవార్‌
ముంబై, నవంబరు 24: చరిత్ర పునరావృతమవుతుంటుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో 41 ఏళ్ల కిందట జరిగిన పరిణామాలు ఇపుడు అదే స్థాయిలో రిపీట్‌ అయ్యాయి. ఈ రెండు కథల్లోనూ ప్రధాన పాత్రధారి శరద్‌ పవారే! నాడు ఆయన పోషించిన పాత్రను ఇపుడు అన్న కొడుకు అజిత్‌ పవార్‌ పోషించారు. నాడు జనతా పార్టీ అయితే నేడు బీజేపీ! ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఓడిపోయింది. రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. ఫలితంగా కాంగ్రెస్‌లో చీలిక రావడంతో తన గురువు యశ్వంతరావు చవాన్‌తో కలిసి కాంగ్రెస్‌ (యూ)లో చేరారు పవార్‌. తదనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ (యూ), ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ (ఐ) విడివిడిగా పోటీచేశాయి. జనసంఘ్‌ (ప్రస్తుత బీజేపీ) భాగస్వామ్యం ఉన్న జనతాపార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. దీంతో రెండు కాంగ్రెస్‌లూ మళ్లీ చేతులు కలిపినా.. వాటి స్నేహం ఎక్కువకాలం నిలువలేదు. పరిస్థితిని గ్రహించిన శరద్‌ పవార్‌ 1978 జూలైలో కాంగ్రెస్‌ (యూ)ని చీల్చి జనతాపార్టీతో చేతులు కలిపారు. ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) పేరిట సంకీర్ణం ఏర్పాటుచేసి సీఎం అయ్యారు. ఇపుడు అజిత్‌పవార్‌ కూడా ఆఖరి నిముషంలో చిన్నాన్నకు ఝలక్‌ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి కాగలిగారు.
బీజేపీకి పవార్‌ ప్రియ శత్రువు
శరద్‌ పవార్‌ గురించి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపించే మాటేంటంటే ఆయన బీజేపీకి ప్రియమైన శత్రువు అని..! ఎందుకంటే రెండుసార్లు కాంగ్రె్‌సను చీల్చిన వ్యక్తి ఆయన. 1978లో ఒకసారి, ఇటలీలో జన్మించిన సోనియా ప్రధాని కావడానికి వీల్లేదంటూ 1999లో సీడబ్ల్యూసీలో తిరుగుబాటు చేసి రెండోసారి పార్టీలో కలకలం రేపారు. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినపుడు బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ విడివిడిగా పోటీచేశాయి. బీజేపీకి 122 సీట్లు మాత్రమే వచ్చాయి. 63 స్థానాలు సాధించిన శివసేన ఇప్పటి మాదిరే బేరాలకు దిగింది. ఆ సమయంలో శివసేన కాదనుకుంటే తాను మద్దతిస్తానని బీజేపీకి పవార్‌ ప్రతిపాదించారు. దాన్ని అప్పట్లో బీజేపీ తిరస్కరించింది. నాడు ఇచ్చిన ఆఫర్‌నే ఇపుడు మళ్లీ పవార్‌ ఇచ్చి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Courtesy Andhrajyothy…

Leave a Reply