లక్షద్వీప్ దర్శకురాలిపై రాజద్రోహం కేసు

0
226

– ఎవ్వరికీ భయపడేది లేదు : ఆయిషా

తిరువనంతపురం: లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరో పణలపై సినీ దర్శకురాలు ఆయిషా సుల్తానాపై రాజద్రోహం కేసు నమోదైంది. ప్రఫుల్‌ కేంద్రం పంపిన జీవాయుధమనీ, కోవిడ్‌ను నియంత్రిం చడంలో విఫలమయ్యారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది. ఓ న్యూస్‌ చానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న ఆమె.. ‘లక్షద్వీప్‌లో గతంలో వైరస్‌ కేసులో లేవు. ఆయనొచ్చాక ఇప్పుడు ప్రతి రోజూ 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఇక్కడకు జీవాయుధాన్ని పంపిందని స్ప ష్టంగా చెప్పగలను’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు పెద్ద రాద్దాం తం చేశారు. వీధుల్లో నిరసన తెలిపారు. బీజేపీ లక్షద్వీప్‌ చీఫ్‌ సి.అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నిరసనలపై కూడా ఆమె తీవ్రంగా మం డిపడ్డారు.

తాను చేసిన వ్యాఖ్యలను ఆమెసమర్థించారు. ‘వారు నాపై రాజద్రోహం కేసు పెట్టారు. కాని ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెప్పగలను. తనపై బీజేపీ కార్యకర్త ఫిర్యాదుచేశారు.

నేనుజన్మించిన ఈభూమి కోసం పోరాటాన్ని కొనసాగి స్తాను. ఎవ్వరికీ భయపడేది లేదు. ఇప్పుడు నా గొంతు మరింత పెద్దదవుతుంది’ అని అన్నారు. బీజేపీ తీరును కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. రాజద్రోహం అనే వ్యాఖ్యలను దుర్వినియోగ పర్చడం ద్వారా వేధింపులకు పాల్పడుతున్నదని విమర్శించారు. హింసను ప్రేరే పించనీ, హద్దు మీరని వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేస్తే దేశద్రోహం కాదనీ, సుప్రీం కోర్టు ఇదే చెబుతున్నా వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు దీన్ని విస్మరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Courtesy Nava Telangana

Leave a Reply