6.83 లక్షల ఉద్యోగాలు ఖాళీ

0
235
  • కేంద్ర శాఖలపై ప్రభుత్వ ప్రకటన
  • పదవీ విరమణ వయసు తగ్గించే యోచన లేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6.83 లక్షలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. కేంద్రం మంజూరుచేసిన 38,02,779 పోస్టుల్లో 31,18,956 ఖాళీలను 2018 మార్చి 1 నాటికే భర్తీ చేసినట్లు ప్రకటించారు. కాగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించాలనే యోచన లేదని తెలిపారు. కాగా, కేంద్రపాలిత ప్రాంతాలు డామన్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీల విలీన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎలకా్ట్రనిక్‌ సిగరెట్ల నిషేధం బిల్లుకూ పచ్చజెండా ఊపింది.

శాఖల వారీగా ఖాళీలు
రైల్వే 2,59,369
రక్షణ 1,87,054
హోం 72,365

దక్షిణాదిలో రెండో రాజధాని యోచన లేదు: హోంశాఖ
దక్షిణ భారత్‌లో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేసే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు స్పష్టం చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు.

 సమ్మె నోటీసు 14 రోజుల ముందే ఇవ్వాలి: కార్మికశాఖ
కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు పోయే విషయాన్ని 14 రోజుల ముందే అధికారులకు నివేదించాలి. ఈ మేరకు కార్మిక చట్టాల్లో సవరణలు చేస్తా మని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతో్‌షకుమార్‌ రాజ్యసభకు తెలిపారు. నల్లా నీటికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్డ్స్‌ (బీఐఎస్‌)ను తప్పనిసరి చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు జలశక్తి శాఖకు ఓ లేఖ రాసింది..

డామన్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీల విలీనానికి ఓకే
కేంద్రపాలిత ప్రాంతాలు డామన్‌ డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీల విలీన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతోపాటు ఎలకా్ట్రనిక్‌ సిగరెట్లను నిషేధించేందుకు సంబంధించిన బిల్లుకూ పచ్చజెండా ఊపింది.

నల్లా నీటికి బీఐఎస్‌ ప్రమాణాలు తప్పనిసరి
నల్లా నీటికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్డ్స్‌ (బీఐఎస్‌)ను తప్పనిసరి చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు జలశక్తి శాఖకు ఓ లేఖ రాసింది..

Courtesy Andhrajyothy…

Leave a Reply