17 ఏళ్లకే పెళ్లి పీటలపైకి!

0
213

17 శాతం బాల్యవివాహాలు…
జాతీయ సగటు కంటే 0.3 శాతం ఎక్కువ
8 30% అమ్మాయిలకు డిగ్రీ పూర్తికాకుండానే పెళ్లి
8 నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదికలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి 100 వివాహాల్లో సగటున 17 పెళ్లిళ్లలో పెళ్లికూతురు వయసు 18 ఏళ్లలోపే ఉంటున్నట్లు నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ పేర్కొంది. 2016లో ఈ సగటు 16.8 శాతంగా ఉండేదని.. 2017 నాటికి 17 శాతానికి చేరిందని వెల్లడించింది. హరియాణా, ఢిల్లీ, అసోం, తెలంగాణ రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అందులో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.రెండింటా అంతే

గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువ. కానీ, హెల్త్‌ ప్రొఫైల్‌ నివేదిక ప్రకారం.. 2017లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ బాల్యవివాహాల సగటు ఒకేలా (ప్రతి 100 పెళ్లిళ్లలో 17) ఉంది. 2016లో మాత్రం పల్లెల్లో బాల్యవివాహాల సగటు 16 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 17 శాతంగా నమోదైంది. అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండాక జరుగుతున్న పెళ్లిళ్ల శాతం పల్లెల్లో 19.4 శాతంగా ఉండగా.. పట్టణాల్లో 19.1 శాతంగా నమోదైంది. 21 ఏళ్లు నిండాక జరుగుతున్న వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లో 23.2ు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 24.6 శాతంగా నమోదైంది.

దేశ సగటు కంటే
0.3 శాతం ఎక్కువ
జాతీయస్థాయిలో బాల్య వివాహాల సగటు కంటే.. మన రాష్ట్రంలో జరుగుతోన్న బాల్యవివాహాల సగటు 0.3 శాతం ఎక్కుగా ఉన్నట్లు ఆ నివేదిక ద్వారా వెల్లడైంది. 18 ఏళ్లలోపు బాలికల వివాహపు సగటు వయసు 2016లో జాతీయస్థాయిలోను, తెలంగాణలోనూ ఒకేలా.. 16.8 శాతంగా నమోదైంది. 2017లో మాత్రం.. జాతీయ స్థాయి సగటు 16.7ు కాగా, తెలంగాణలో 17 శాతంగా నమోదైంది. 18-20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు 19.3ు కాగా.. 30 శాతం మంది యువతులు డిగ్రీ పూర్తి కాకుండానే పెళ్లిపీటలపై కూర్చుంటున్నారు. కాగా.. చిన్న వయసులో వివాహాల కారణంగా బాలికల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

మాతా మరణాలు పెరుగుతాయి
బాల్య వివాహాలతో మాతా మరణాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే.. కనీస వివాహ వయసు రాకుండా గర్భం దాల్చినవారిలో గర్భస్రావ ముప్పు, నెలలు నిండకుండానే కాన్పు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే, వారికి సహజ ప్రసవం కావడం కూడా కష్టం. పుట్టే బిడ్డల్లో ఎదుగుదల సరిగా ఉండదు.
– డాక్టర్‌ వెల్లంకి జానకి, గైనకాలజిస్టు, గాంధీ ఆస్పత్రి
                                                                                                 Courtesy Andhrajyothy

Leave a Reply