- నిజామాబాద్ బీజేపీ నేతలపై మహిళ ఫిర్యాదు
- పార్టీ నుంచి ఒకరి సస్పెన్షన్
ఖిల్లా (నిజామాబాద్) : బీజేపీ నేతలు కొందరు తనను లైంగికంగా వేధిస్తున్నారని, వారి నుంచి తనను రక్షించాలని నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. నగరానికి చెందిన ఓ వివాహిత స్థానికంగా ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్, జిల్లా నాయకులు పిట్ల స్వామి, పుల్ల సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కలిసి నెల రోజులుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, ఫిర్యాదు విషయం తెలుసుకున్న బీజేపీ పెద్దలు.. ప్రసాద్ పటేల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.