కీచక ప్రొఫెసర్‌ను తొలగించండి

0
248

– బెనారస్‌ వర్మిటీ విద్యార్థుల ఆందోళన
                              లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ యూనివర్శిటీ విద్యార్థులు శనివారం రాత్రి క్యాంపస్‌ ఎదుట నిరసనలు చేపట్టారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై గత ఏడాది సస్పెండైన ప్రొఫెసర్‌..తిరిగి క్లాసులు తీసుకుంటుండంతో… నిరసనగా విద్యార్థులంతా ఏకమై యూనివర్శిటీ ముందు ఆందోళనలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను విద్యార్థులను ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేశారు. వీరికి మద్దతుగా మరికొంత మంది విద్యార్థులు ఆదివారం నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. క్యాంపస్‌కు కట్టిన బ్లాక్‌ బ్యానర్‌పై ‘ చఎఱరశీస్త్రyఅఱర్‌Vజ అని రాసి ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో ఒడిశాలో పర్యటనకు వెళ్లిన సమయంలో జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ షైల్‌ కుమార్‌ చౌబే విద్యార్థినుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు అశ్లీల హావభావాలను ప్రదర్శించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో ప్రొఫెసర్‌ను తొలుత సస్పెండ్‌ చేసి, ఈ ఏడాది జూన్‌లో విచారణకు ఆదేశించారు. అయితే యూనివర్శిటీలోని అత్యున్నత స్థాయి కమిటీ ఈ సస్పెన్షన్‌ను రద్దు చేసి, ప్రొఫెసర్‌కు చీవాట్లు పెట్టాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయ సమాచారం. విశ్వవిద్యాలయ అంతర్గత ఫిర్యాదుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం చౌబేను తిరిగి నియమించినట్లు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో కొన్ని రోజుల నుండి తరగతులను తీసుకునేందుకు రావడంతో విద్యార్థుల ఆగ్రహా జ్వాలలు మిన్నంటాయి. వారిని శాంతింపజేయడానికి విశ్వవిద్యాలయ పరిపాలన యంత్రాంగం విద్యార్థులతో సమావేశమైంది. అంతర్గత కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా చౌబేను సస్పెండ్‌ చేశామని, అయితే అతడికి కఠినమైన శిక్షను విధించాలని అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయించినట్లు చీఫ్‌ ప్రొక్టార్‌, డిప్యూటీ ప్రొక్టార్‌, రిజిస్ట్రార్‌ విద్యార్థులతో తెలిపారని, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరినట్లు యూనివర్శిటీ ప్రొఫెసర్‌ రాజేష్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు. తిరిగి అతని విధుల్లోకి తీసుకోవా లన్న నిర్ణయం జూన్‌ 7నే జరిగిందని తెలిపారు. అయితే విశ్వవిద్యాలయ చర్యలపై తమకు నమ్మకం లేదని విద్యా ర్థులు పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ను తొలగించి, అతనిపై ఎఫ్‌ఐ ఆర్‌ దాఖలు చేసే వరకు నిరసన తెలుపుతామని అన్నారు. చౌబేపై అనేక లైంగిక ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు

Courtesy Prajasakthi..

Leave a Reply