చికిత్సకు డబ్బులేక ఆత్మహత్య

0
240
  • జ్వర బాధితుడి బలవన్మరణం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారంలో ఘటన
  • విషజ్వరాలతో ఏడుగురి మృతి
  • చికిత్సకు డబ్బులేక ఆత్మహత్య
  • జ్వరం నుంచి కోలుకునే దారిలేక బలవన్మరణం

విషజ్వరం బారిన పడి.. చికిత్స చేయించుకునేందుకు డబ్బులేక భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైలారం పంచాయతీకి చెందిన నల్లారి పుల్లయ్య(50) అనే రైతు పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వేల రూపాయలు ఖర్చు చేసినా.. జ్వరం తగ్గలేదు. మరికొన్ని రోజులు చికిత్స చేయించుకునేందుకు డబ్బులేక ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. మరోవైపు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని హర్యా తండాలో అజ్మీరా రాంజీ(45), వైరా మండలం తాటిపూడికి చెందిన పిడియాల యశోద(38), ఖమ్మంకు చెందిన మద్దెల శ్రావణ సంధ్య(40) డెంగీతో మృతి చెందారు.

లక్ష్మీదేవిపల్లి మండలానికే చెందిన సెట్టిపల్లి నాగేష్‌, మణుగూరుకు చెందిన కొల్లు స్వరూప(33) విషజ్వరంతో చనిపోయారు. సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన జి.వనజ(45), హైదరాబాద్‌లోని గౌతమ్‌నగర్‌-మల్లికార్జున్‌నగర్‌కు చెందిన చిన్నారి తన్వీ(3) డెంగీతో మృతి చెందారు.

Courtesy Andhrajyothi

 

 

Leave a Reply