గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి

0
496

 

 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్. రాష్ట్రం నలుమూలల నుండి సీరియస్ కేసులు ఇక్కడికి రిఫర్ చేస్తారు.

ఇక్కడ లేని సదుపాయం అంటూ ఉండదని, ఇక్కడ నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందని ప్రతీ ఒక్క పేదవాడి నమ్మకం.

గత ప్రభుత్వ హయాంలో ఈ హాస్పిటల్ బాగా అభివృద్ధి జరిగింది. కార్పోరేట్ హాస్పిటళ్లకు ధీటుగా అన్ని వసతులూ కల్పించబడి నాణ్యమైన ఉచిత వైద్యం అందింది. హాస్పిటల్ లో సెక్యురిటి చాలా టైట్ గా ఉండేది. గేట్ పాస్ లేకుండా ఎవ్వరినీ హాస్పిటల్ లొపలికి అనుమతించేవారు కాదు.ఏ మందులకూ బయటకు వెళ్లకుండా అన్నీ లోపలే దొరికేవి. హాస్పిటల్లో సిబ్బంది చాలా బాగా వైద్యం చేసేవారు.

ఇప్పుడు పరిస్థితి కొంచెం మారిందని అనుమానం వస్తోంది. సెక్యూరిటీ టైట్ గా లేదు,గేట్ పాసుల ఊసే లేదు. సిరంజులు, IV ట్యూబులు, కొన్ని ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ వగైరాలు లోపల లేవు బయటకు వెళ్లి తెచ్చుకోండి అని నర్సులు, డాక్టర్లు అనడం రోగులకు ఒకింత అసహనం కలిగిస్తోంది.ఈ ఖర్చులు రోగులకు భారంగా మారుతున్నాయి.

ఇంత పెద్ద హాస్పిటల్లో 24 గంటలు ఉచిత తాగు నీరు దొరకదు.24 గంటలూ ఉచిత మందుల షాపు అందుబాటులో ఉండదు.

ఇక్కడికి వచ్చేవారు దాదాపు పేదవారు కటిక పెదవారే.చేతిలో తక్కువ మొత్తంలో డబ్బులు తెచ్చుకొని రోజులూ, వారాలూ, నెలలూ గడపాల్సిన పరిస్థితి.రోగి వెంట వచ్చే వారికి తినడానికి, తాగడానికి భయంకరంగా ఖర్చులు అవుతున్నాయి. కేవలం తాగే నీళ్లకే రోజూ50 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.ఇక తినడానికి అయితే ఖర్చులు భారీగా ఉంటాయి.మొత్తంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రోగులకు పెనుభారంగా మారితే పేద రోగులు ఎక్కడికెళ్లాలి?వారి ప్రాణాలు ఎలా నిలబడాలి?

జగన్ గారికి నా వినతి:

ఇది రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఇక్కడికి వచ్చే రోగులకు ఎటువంటి ఖర్చులు అవ్వకుండా ఎన్ని రోజులు ఉన్నా ఉచిత వైద్యం అందాలని కోరుకుంటున్నాను.అందుకు గానూ…

హాస్పిటల్ లోకి రోగి అడుగు పెట్టాక అన్ని మందులూ, టెస్టులూ బయటకు పంపించకుండా అందించాలి.రోగి తరుపున వచ్చిన వారికి కూడా ఖర్చులు అవ్వకుండా ప్రభుత్వం చూసుకోవాలి.24 గంటలూ ఉచిత మంచినీరు,వేళకు సరైన భోజన వసతి కల్పించాలి.ఎందుకంటే రాష్ట్రంలో బిచ్చగాళ్ల ప్రాణాల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల ప్రాణాల వరకూ ఇదే హాస్పిటల్ పై ఆధారపడి ఉన్నాయి.వేలకోట్ల సంక్షేమ పథకాలు తర్వాత సంగతి ముందు పేదవాడి ప్రాణాలు కాపాడే ఉచిత వైద్యం అందించండి చాలు.????????????.

Leave a Reply