ఫోన్ అమ్మి.. కుటుంబానికి సరుకులు తెచ్చి

0
246

– ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డ దినసరి కూలీ
– లాక్‌డౌన్‌తో పనుల్లేక తీవ్ర ఇక్కట్లు
– గురుగ్రాంలో ఘటన

న్యూఢిల్లీ : ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దేశవ్యాప్త లాక్‌డౌన్‌’ అ సంఘటితరంగ కార్మికుల పాలిట శాపంగా మారింది. పనుల్లేక, తినడానికి తిండి కరువై లక్ష లాది మంది ఆకలికి అలమటిస్తుండగా.. దేశ రాజ ధానికి కూతవేటు దూరంలో ఉండే గురుగ్రాంకు చెందిన ఓ దినసరి కూలీ.. ఆకలి బాధలు భరించ లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోయినా తన కుటుంబమైనా నాలుగు ముద్దలు తినాలనే ఉద్దేశంతో.. అతడి వద్ద ఉన్న ఫోన్‌ను అమ్మి, ఇంటికి సరుకులు కొనితెచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా కార్మికుడు.

వివరాల్లోకెళ్తే బీహార్‌కు చెందిన ముఖేశ్‌ గురుగ్రాం లోని ఓ మురికివాడలో నివసిస్తున్నాడు. గురుగ్రాం లోని డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-5 ఏరియాలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, నలుగురు పిల్లలు. పెయింటర్‌గా పనిచేసే ముఖేశ్‌.. కొద్దికాలంగా గృహ నిర్మాణ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటుండటంతో ఏ పని దొరికితే దానికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ గతనెల కేంద్రం ఒక్కసారిగా విధించిన లాక్‌డౌన్‌తో పనులన్నీ నిలిచిపోవడంతో పని దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఇల్లు గడవడం కష్టమైంది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో కొన్నాళ్లు కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ముఖేశ్‌.. అవీ అయిపోవడంతో తన ఫోన్‌ అమ్మకానికి పెట్టాడు. వచ్చిన డబ్బులతో ఇంట్లోకి బియ్యం, పిండి, నూనె, ఇతర సరుకులతో పాటు తన బిడ్డలు పడుకోవడానికి చిన్న టేబుల్‌ ఫ్యాన్‌ కొనుక్కొచ్చాడు. మిగిలిన డబ్బును తన భార్యకు ఇచ్చి జాగ్రత్తగా వాడుకోమని చెప్పాడు. ఆమె బయటకు వెళ్లగానే ఉరేసుకుని చనిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ముఖేశ్‌ భార్య వచ్చి చూసేసరికి.. అతడు విగతజీవిగా పడి ఉన్నాడు.

ముఖేశ్‌ భార్యకు ఇచ్చిన డబ్బులతోనే అతడి అంత్యక్రియలు జరిపించడం అత్యంత విషాదకరం. దీనిపై బాధితుడి మిత్రుడు ఉమేశ్‌ మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా పెయింటింగ్‌ పని దొరక్కపోవడంతో అతడు దినసరి కూలీ గా చేశాడనీ, కానీ లాక్‌డౌన్‌ తర్వాత అది కూడా లేకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్నాడని తెలిపాడు. ఇల్లు గడవడం కష్టంగా ఉందంటే తాము కూడా కొంత సాయం చేశామనీ, కానీ ఇంతలోనే అతడు చనిపో వడం బాధాకరమని అన్నాడు. అయితే పోలీసులు మాత్రం.. ముఖేశ్‌ మతిస్థిమితం కోల్పోయాడనీ, కొద్దికాలంగా అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కేసునమోదు చేసుకోవడం గమనార్హం. అసంఘటిత రంగ కార్మికులు, దినసరి కూలీలు నగరాలు విడిచి ఎక్కడికీ వెళ్లొద్దనీ, వారిని ప్రభుత్వమే ఆదుకుంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబు తున్నా వాస్తవంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పనుల్లేక పోవడంతో వేలాది మంది కార్మికులు ఢిల్లీ నుంచి యూపీ, బీహార్‌, మహారాష్ట్ర వరకు కాలినడకనే వస్తున్న విషయం విదితమే. వీరిని ఆదుకుంటామని చెబుతున్న కేంద్రప్రభుత్వం వసతిగృహాల్లో ఉన్నవారికి రెండుపూటల తిండికూడా సరిగ్గాపెట్టడంలేదని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. దీంతో ఇన్నాళ్లు వసతి గృహాల్లోనో, రోడ్లమీదో కాలం వెల్లదీ సిన కార్మికులు లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఇంటి తోవలు పడుతున్నారు.బివైనగర్‌, గణేష్‌నగర్‌వాసులకు పంపిణీ చేశారు.

Courtesy Nava Telangana

Leave a Reply