కొడుకు ప్రియురాలిపై అత్యాచారం

0
262
కొడుకు ప్రియురాలిపై అత్యాచారం
  • పెళ్లి చేస్తానని పిలిచి ఘాతుకం
  • బలవంతంగా తాళి కట్టి రేప్‌
  • తమిళనాడులో ఘటన

చెన్నై : కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తండ్రి వద్దన్నాడు. కొడుకు చచ్చిపోతానన్నాడు. దీంతో ఆ తండ్రి ప్రేమికులిద్దరినీ విడదీయడానికి నీచమైన పథకం వేశాడు. సదరు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేస్తానంటూ తీసుకువచ్చాడు. మార్గమధ్యలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే తాళి కట్టాడు. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు నిత్యానందం. అతని కుమారుడు ముకేశ్‌ కన్నన్‌. ముకేశ్‌ కన్నన్‌, బాధితురాలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలోనే నిత్యానందం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇకనుంచి తనతోనే కాపురం చేయాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆమెను తన స్నేహితుడి ఇంట్లో నిర్బంధించాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోపక్క, ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోబోతోందని కొడుకును నమ్మించాడు. ఇదిలా ఉండగా నిర్బంధంలో ఉన్న యువతి తప్పించుకుని వేదారణ్యం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Courtesy Andhrajyothi

Leave a Reply