వలస కూలీలకు సోనూసుద్ 3 లక్షల ఉద్యోగాలు ఆఫర్

0
331
సోనూసూద్‌ పుట్టినరోజు కానుకగా
కరోనా సంక్షోభంలో కష్టాల్లో ఉన్న వలస కూలీలను ఆదుకోవడంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ చేసిన సహాయం అంతా ఇంతాకాదు. వలస కూలీలను ఆదుకోవడంలో తను ఎంతో సేవ చేశాడు. నటుడు సోనూసూద్‌ గురువారం తన 47వ పుట్టినరోజు సందర్భంగా మరో నిర్ణయాన్ని ‘ప్రవాసీ రోజ్‌గార్‌’ పోర్టల్‌ ద్వారా వలస కూలీలకు మరో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. మంచి జీతంతోపాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా వలసకులీలకు అందేలా చేస్తానని ఆయన ఆ పోస్టులో వివరించారు. తన చేస్తున్న ఈ ప్రయత్నంలో అమెజాన్‌, సోడెక్స్‌, ట్రిడెంట్‌ సంస్థలకు సోనూసూద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply