కోవిడ్‌ బారిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

0
234

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. దేశ ప్రధానుల నుంచి నిరుపేదలకు వరకు కోవిడ్‌ బారిన పడుతున్నారు. సినిమా ప్రముఖులు కూడా కరోనా కోరల్లో చిక్కుకుంటున్నారు. సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సోకిందని వీడియో ద్వారా తెలిపారు.

జ్వరం, దగ్గుతో బాధపడుతున్న తాను పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థరణ అయిందని చెప్పారు. ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హోం క్వారంటైన్‌లో ఉండమని చెప్పినప్పటికీ కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లో పడేయటం ఇష్టంలేక ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన అభిమానులు, ఆత్మీయులు ఆందోళన చెందవద్దని కోరారు. తనను పరామర్శించేందుకు ఫోన్‌ చేయవద్దని ఎస్పీ బాలు విజ్ఞప్తి చేశారు. సినిమా పరిశ్రమకు చెందిన వారు వరుసగా కరోనా బారిన పడుతుండటంపై టాలీవుడ్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Leave a Reply