ఇజ్రాయెల్‌ హ్యాకింగ్‌ బాధితుల్లో.. తెలంగాణ న్యాయవాది

0
268

రాజకీయ ఖైదీల విడుదలకు పోరాటాలు

  • హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టు విచారణకు డిమాండ్‌

సైబర్‌ నిఘా సేవలు అందించే ఇజ్రాయెలీ కం పెనీ ఎన్‌ఎ్‌సవో హ్యాకింగ్‌ బాధితుల్లో తెలంగాణ హై కోర్టు న్యాయవాది బల్లం రవీంద్రనాథ్‌ కూడా ఉన్నారు. ఆయన పదేళ్లుగా కమిటీ ఫర్‌ ద రిలీజ్‌ ఆఫ్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (సీఆర్‌పీపీ) ప్రధాన కార్యదర్శిగా పోరాటం చేస్తున్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో నిజనిర్ధారణకు వెళ్తుండగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి, 6 నెలలు జైలులో పెట్టారు. తన ఫోన్‌ను కూడా ఎన్‌ఎ్‌సవో హ్యాక్‌ చేసిందని, వాట్సాప్‌ తరఫు సెక్యూరిటీ నిపుణుడి ద్వారా ఈ విషయం తెలిసిందని ఆయన వెల్లడించారు.నా ఫోన్‌ హ్యాక్‌ అయిన విషయాన్ని టొరంటో వర్సిటీ స్కాలర్‌ జాన్‌ స్కాట్‌ అక్టోబరు 7న వాట్సాప్‌ ద్వారా తెలిపారు. ఇజ్రాయెల్‌ హ్యాకింగ్‌ కేసులో ఆయన వాట్సాప్‌ తరఫున పనిచేస్తున్నారు.

అక్టోబరు 29న వాట్సాప్‌ కూడా స్వయంగా ఈ విషయాన్ని తెలిపింది అని ఆయన వివరించారు. భారతీయ జర్నలిస్టులు, మేధావులు, హక్కుల కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్‌ ఉదంతంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అటు వాట్సాప్‌ ద్వారా హ్యాకింగ్‌ ప్రకంపనలు కేంద్రంలో మిన్నంటాయి. ఇది కేంద్రప్రభుత్వం పనేనని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీనిపై 4లోగా వివరణ ఇవ్వాలంటూ గురువారం వాట్సా్‌పకు నోటీసులు జారీ చేసి.. చేతులు దులుపుకొన్న కేంద్రం ఆ సంస్థపై మండిపడింది. తాము మేలోనే భారత్‌కు హ్యాకింగ్‌ విషయం చెప్పామని వాట్సాప్‌ స్పష్టం చేసింది.

Courtesy Andhrajyothi…

 

Leave a Reply