ఎస్సీ, ఎస్టీల పరీక్ష ఫీజులు భారీగా పెంపు

0
253
  • 24 రెట్లు పెరిగిన సీబీఎ్‌సఈ ఫీజుల భారం

న్యూఢిల్లీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజుల్ని సీబీఎ్‌సఈ భారీగా పెంచింది. ఈ సంవత్సరం 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై ఈ భారం పడనుంది. ఇప్పటి వరకు వీరు ఐదు సబ్జెక్టులకు రూ.50 చెల్లిస్తే సరిపోయేది. ఈ సంవత్సరం నుంచి సీబీఎ్‌సఈ ఆ మొత్తాన్ని 24 రెట్లు పెంచి రూ.1,200 చేసింది. జనరల్‌ క్యాటగిరి విదార్ధుల ఫీజునీ రూ.750 నుంచి రూ.1,500కు పెంచింది. పాత నిబంధల ప్రకారం ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థుల నుంచి కూడా మిగిలిన మొత్తాన్ని వసూలు చేయాలని పాఠశాలలను కోరింది.

విదేశాల్లోని సీబీఎ్‌సఈ స్కూల్స్‌ నుంచి 10, 12 తరగతులు పరీక్షలకు నమోదయ్యే విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు ఇప్పటి వరకు రూ.5,000 చెల్లిస్తే సరిపోయేది. ఇపుడు ఈ మొత్తాన్ని రూ.10,000కు పెంచారు. ఇప్పటి వరకు 12 క్లాస్‌లో ఏదైనా అదనపు సబ్జెక్ట్‌ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇపుడు ఇపుడు ప్రతి అదనపు సబ్జెక్ట్‌కు రూ.300 చొప్పున ఫీజు చెల్లించాలి.

Courtesy andhrajyothi

Leave a Reply