జార్ఖండ్ ఎమ్మెల్యేల్లో 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు

0
201

– 69 శాతం మంది కోటీశ్వర్లు… నలుగురు డాక్టరేట్లు
– 10 మంది మహిళా ఎమ్మెల్యేలు
ఏడీఆర్‌ నివేదికలో వెల్లడైన కీలక అంశాలు

న్యూఢిల్లీ : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని కీలక అంశాలు బహిర్గతమయ్యాయి. జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 81 స్థానాల్లో మహాకూటమి జేఎంఎం 30, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1) 47 స్థానాలను, బీజేపీ 25, జేవీఎం(పీి) 3, ఏజేెఎస్‌యూ 2, ఎన్‌సీపీ 1, సీపీిఐఎంఎల్‌ (లిబరేషన్‌) 1, స్వతంత్రులు 2 స్థానాలను గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేలకు క్రిమినల్‌ కేసుల జాబితా, సంపద వంటి అంశాలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీిఆర్‌) మంగళవారం వెల్లడించింది. 81 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది (54 శాతం) క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. అందులో 34 మంది (42 శాతం)పై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు సైతం ఉన్నాయి. అత్యాచారం, హత్యలు, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య గతంతో పోల్చితే తగ్గినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 55 మంది (68 శాతం) క్రిమినల్‌ కేసులు ఎదుర్కొన్నవారు ఉన్నారు. దాంతో పోల్చితే 14 శాతం క్రిమినల్‌ కేసులున్న ఎమ్మెల్యే సంఖ్య తగ్గింది. ఇందులో 25 బీజేపీ ఎమ్మెల్యేల్లో 12 మంది, 30 మంది జేఎంఎం ఎమ్మెల్యేల్లో 17 మంది, 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో 8 మంది, ఇద్దరు ఏజేఎస్‌యూ ఎమ్మెల్యేల్లో ఒకరు, జేవీఎం(పీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ 9 మంది, జేెఎంఎం 12 మంది, కాంగ్రెస్‌ 8 మంది, జేవిఎం(పీ) ముగ్గురు ఉన్నారు.
56 మంది కోటీశ్వరులు ఉన్నారు. 2014లో 41 మంది ఉండేవారు. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పార్టీల వారీగా చూస్తే బీజేపీ 18 మంది, జేఎంఎం 22 మంది,, కాంగ్రెస్‌ 9 మంది, ఏజేెఎస్‌యూ ఇద్దరు, జేవీఎం(పీి) ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు.

30 మంది మంది ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉత్తీర్ణులు అయ్యారు. వారిలో 8వ తరగతి ఉత్తీర్ణత అయినవారు ఇద్దరు, పది ఉత్తీర్ణత అయినవారు 13 మంది, పన్నెండో తరగతి ఉత్తీర్ణత అయినవారు 15 మంది ఉన్నారు. 49 మంది మంది డిగ్రీ ఆపై చదివారు. వారిలో డిగ్రీ పూర్తి చేసినవారు 26 మంది, డిగ్రీ ప్రొఫెషనల్‌ పూర్తి చేసినవారు ఆరుగురు, పీజీ పూర్తి చేసిన వారు 13 మంది, డాక్టరేట్‌ నలుగురు చేశారు. ఒక ఎమ్మెల్యే తాను కేవలం అక్షరాస్యుడుని అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే డిప్లొమో చేశారు. ఈసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది మహిళలు ఉన్నారు. 2014లో 8 మంది మహిళలు ఉన్నారు. ఈసారి 45 మంది కొత్తవారు కాగా, 36 మంది తిరిగి ఎన్నికయ్యారు.

Courtesy Nava telangana

Leave a Reply