తోటి టీచర్‌పై అత్యాచారం

0
179
  • కారులో ఖమ్మం తీసుకెళ్తానని నమ్మించి ఘాతుకం
  • బాధితురాలి ఫిర్యాదు.. నిందితుడిపై కేసు నమోదు

ఖమ్మం క్రైం : మాయమాటలతో తోటి ఉపాధ్యాయురాలిని కారులో ఎక్కించుకున్న ఓ ఉపాధ్యాయుడు తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బి.కిషోర్‌.. ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఆయన భార్య కూడా గార్ల మండంలోని మరో పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఇద్దరూ రోజూ కారులో విధులకు వెళ్లి వస్తుంటారు. తన భార్యకు పరిచయమున్న మరో ఉపాధ్యాయురాలు ఖమ్మం నుంచి రైల్లో తాను పని చేసే పాఠశాలకు రోజూ వెళ్లి వస్తుంటుంది.

కిషోర్‌, అతడి భార్యతో పాటు బాధిత ఉపాధ్యాయురాలు గతంలో కారులో ఎన్నోసార్లు ఖమ్మం వచ్చారు. ఆ పరిచయంతో ఈ నెల 17న సాయంత్రం గార్ల రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న ఉపాధ్యాయురాలిని కిషోర్‌ తన కారులో ఖమ్మం రావాలని ఒత్తిడి చేశాడు. వెంట తన భార్య కూడా వస్తుందని, ఆమె వేరే చోట కారు ఎక్కుతుందని నమ్మబలికాడు. బాధితురాలిని కిషోర్‌.. ఖమ్మం పాండురంగాపురంలోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వారు మంగళవారం ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Leave a Reply