ఆ పది యమ డేంజర్‌!

0
227

దేశవ్యాప్తంగా 10 కరోనా వ్యాప్తి కేంద్రాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రస్థానాలుగా భావిస్తున్న 10 ప్రదేశాలను కేంద్రం గుర్తించింది. వీటిలో ఢిల్లీ, యూపీ, కేరళ, మహారాష్ట్రల్లో రెండేసి, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు ప్రాంతాలనూ వైరస్‌ హాట్‌స్పాట్స్‌గా ప్రకటించింది.

ఢిల్లీ: సూఫీ మతగురువు ఖ్వాజా నిజాముదీన్‌ దర్గా వైర్‌సవ్యాప్తి కేంద్రాల్లో అగ్ర స్థానంగా గుర్తించారు. మార్చి 1-15 మధ్య జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరైన వేలాది మందిలో అనేక మంది వైరస్‌ బారిన పడ్డట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చా రు. వీరు తిరిగిన అనేక రాష్ట్రాల వారికి ఇది వ్యాపించింది. దిల్షన్‌ గార్డెన్‌ ఈశాన్య ఢిల్లీలోని ఓ ప్రాంతం. సౌదీ వెళ్లొచ్చి న ఓ మహిళకు వైరస్‌ సోకింది. ఆమె నుంచి ఆమె కుమార్తెకు, మరో ముగ్గురు బంధువులకు సోకింది. ఆమె ఓ క్లినిక్‌కు వెళ్లాక అక్కడి డాక్టర్‌కు, ఆయన భార్యకు సోకింది.

యూపీ: ఢిల్లీని ఆనుకుని ఉన్న నొయిడాలో 38 కొవిడ్‌ కేసు లు నమోదయ్యాయి. మరో 32 కేసుల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా ఇవి వ్యాపించినట్లు నిర్ధా రించారు. 626 నమూనాలు పరీక్షించారు. 1852 మంది నిఘాలో ఉన్నారు. 300 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. యూపీలోని మేరట్‌లో కేసుల సంఖ్య 100 దాటింది. వీరిలో 19 మందికి పాజిటివ్‌. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన 72 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది.

మహారాష్ట్ర: ముంబైలోని వర్లి, కొలివాడ, గోరెగాం మహారాష్ట్రలో ప్రఽధాన వ్యాప్తి కేంద్రాలుగా నిర్ధారించారు. ముంబైలో 8మంది మరణించారు. 167మంది చికిత్సలో ఉన్నారు. వీరిలో మూడో వంతు మంది పరిస్థితి విషమం. మహారాష్ట్రలో 230 మందికి వైరస్‌ సోకగా 10 మంది చనిపోయారు. రాష్ట్రంలో 181 ఏక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో కొవిడ్‌-19 మొదలైంది పుణెలోనే. అయితే ఇక్క డ పరిస్థితి మరీ అంత ఆందోళనకరం కాదని అధికారులు అంటున్నారు. అక్కడ 46 ఏక్టివ్‌ కేసులున్నాయి.

కేరళ: దేశంలో అతి తీవ్రంగా వ్యాపించిన జిల్లా. 100 మం దికి పాజిటివ్‌ తేలగా.. 7725 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. పథనంథిట్టలో పాజిటివ్‌ కేసులు ఐదే.

గుజరాత్‌: రాష్ట్రంలో నమోదైన 73 కేసుల్లో 28 అహ్మదాబాద్‌లోనివే. చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు ఇక్కడి వేళ్లే.

రాజస్థాన్‌: రాష్ట్రంలో నమోదైన 106 పాజిటివ్‌ కేసుల్లో 26 జౌళి నగరమైన భిల్వారాలోనే! ఇద్దరు చనిపోయారు. 1200 మంది పరిశీలనలో ఉన్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply