అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

0
82

వెంకటాపూర్‌ (రామప్ప), వీణవంక, నల్లబెల్లి : ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం ఇంచెంచెరువుపల్లి గ్రామానికి చెందిన బానోతు హరి (50) ఆదివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లికి చెందిన భూక్య రాజు (47)లో సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన రైతు జునుమాల కొంరయ్య (45) మంగళవారం పురుగుల మందు తాగి చనిపోయాడు.

Leave a Reply