విచారణ పేరుతో గిరిజనుడిని హింసించడంపై హైకోర్టు ఆగ్రహం

0
254

న్యాయ విచారణకు ఆదేశించిన న్యాయస్థానం

 

హైదరాబాద్‌ : ఓ హత్య కేసులో విచారణ పేరిట గిరిజనుడిని హింసించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జికి గురువారం ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండాకు చెందిన బన్యా అనే వ్యక్తిని విచారణ పేరిట దారుణంగా కొట్టారని, దీంతో కాళ్లు విరిగిపోయాయని ఆయన భార్య కమలమ్మ ఆరోపించారు. ఈ మేరకు పోలీసు అధికారులకు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితమైంది. పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం… ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జికి ఽధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.

Leave a Reply