అమర వీరులకు విప్లవ జోహార్లు

0
438

కాజిపేట: భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం (మా.లె) UCCRI-(ML)కిషన్ వర్గం. ఆధ్వర్యంలో కుల-వర్గ సిద్దాంతవేత్త, ఉద్యమాల ఉపా ధ్యాయులు,దళిత, బహుజనోద్యమాల సార ధి కామ్రేడ్ ‘ఊసా’ మరియు కమ్యూనిస్టు విప్లవ కారుల అగ్రనాయకులు అమరులు కామ్రేడ్స్ దేవులపల్లి వెంకటేశ్వరరావు(డి.వి)- తరిమెల నాగి రెడ్ఢి (టి.ఎన్)లకు అలాగే నేటివరకు భారత విప్లవ సాధన కోసం పని చేసి,అసువులు బాసిన అమర వీరులందరికి విప్లవ జోహార్లు అర్పిస్తూ అమర వీరుల సంస్మ రణ సభను అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తాం! కుల-వర్గ జమిలీ పోరాటాలు వర్ధిల్లాలి! మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి! అనే నినాదాలు హోరుతో,. బుఛ్చన్న డిఎస్ వో కుమార్ లు ఆలపించిన విప్లవ గేయాలతో, రైల్వే కార్మికోద్యమ నాయకులు అమరులు కామ్రేడ్స్ పాకాల దేవదానం, దువ్వ ఐలయ్యల ప్రాంగణంలో(కాజిపేట బాపూజీ నగర్ లోని పాపుడాల రాజయ్య ఇంటిపై, బంగ్లా మీద) గణంగా జరుపు కోవడం జరిగింది.

వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన 32 మంది ప్రతినిదులు (15 మంది మహిళలు,17 మంది పురుషులు) కరోనా జాగ్రత్తలు తీసుకొని, భౌతిక దూరాన్ని పాటించి పాల్గొన్న, ఈ సభకు UCCRI-(ML)కిషన్ వర్గం వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ MD.హసన్ అధ్యక్ష త వహించగా గడ్డం సదానందం- UCCRI-(ML)కిషన్ వర్గం కార్యదర్శి, తంగెళ్ళ సుదర్శనం- విరసం నేత, ఉపాధ్యా యులు, కొమ్ముల సురెందర్- కుల అసమానతా నిర్మూలనా పోరాట సమితి (KANPS)రాష్ట్ర కన్వీనర్, పోరిక ఉదయ్ సింగ్- ట్రైబల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (TDF)రాష్ట్ర కన్వీనర్, కె. కుమారస్వామి-ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఇండియా (TUCI)జాతీయ కౌన్సిల్ సభ్యులు, జన్ను సాంబయ్య-RPI బొజ్జా తారకం రాష్ట్ర కన్వీ నర్, తదితరులు
పాల్గొని ప్రసంగించారు.

కమ్యూనిస్టు విప్లవకారుడైన ఉద్యమాల ఉపాధ్యాయుడు, కుల-వర్గ సిద్దాంతవేత్త, బహుజన, సామాజి కోద్యమయోదుడు, ప్రజా స్వామిక హక్కులనేత, కామ్రేడ్ ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉ.సా.)గారు ది: 25-07- 2020 ను తెల్లవారు జామున హైదరాబాద్ బ్రిస్టాల్ కేర్ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో పోరాడి తన చివరి శ్వాస నొదిలారు. ఉ.సా. మరణం విప్లవ-ప్రజా ఉద్యమాలకు, దళిత- బహుజన పోరాటాలకు తీరనిలోటని, ఆయన కృషి-త్యాగాలను మననం చేసుకుంటూ ఆయన ఆశ యాలను కొనసాగిస్తామని ప్రతిన బూనారు.

కామ్రేడ్ గడ్డం సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సాయధ పోరాటం (1946-51)లో తొలి అమ రుడైన కామ్రేడ్ దొడ్డి.కొమరయ్య అమర త్వం మొదలుకొని భారత కమ్యూ నిస్టు విప్లవోద్యమ అగ్రనేతలు కామ్రడ్స్ దేవులపల్లి వెంకటేశ్వ రరావు (డి.వి)-తరిమెల నాగిరెడ్డి (టి.ఎన్).మరో విభిన్న పంథాకు ప్రాతినిధ్యం వహించిన చారుమజుందార్ లు అనేక మంది విప్లవయోదులు జూలై మాసం లోనే అమరులై నారు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డికి, డి.వికి కొరి యర్ గా వ్యవహరించి, UCCRI-(ML)లో వృత్తి విప్లవ కారుడిగా, నల్లగొండ జిల్లా మోత్కూరు ప్రాంతంలో అనేక ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన ఉ.సా గారు కూడా జూలై మాసంలోనే మరణించారు. కావున డి.వి- టి.ఎన్ లతో కలిపి ఉ.సా సంస్మరణ సభను నిర్వహించా ము. అలాగే జూలై మాసా న్నిఅమరుల మాసంగా బావిస్తూ.. ఈ “సంస్మరణ సభ” ను నిర్వహించాం.

భారత విప్లవం-భారత ప్రజల జన్మహక్కు, విప్లవం కోసం పని చేయటం విప్లవకారుల జన్మ హక్కు, ఈ విప్లవాన్ని పాలక వర్గాల లక్షాధికారి సాయుధ బలాల పాశవిక నిర్భంద విధానము, హరించ జాలదు, అణచి వేయజాలదు. భారత జనతా ప్రజాతంత్ర విప్ల వం విజయవంతమై తీరుతుంది.ఇది జగమెరి గిన సత్యమని అమరుడు డి.వి చెప్పినమాటలు అక్షరసత్యాలు. పార్లమెంటు-ఆసెంభ్లీలు బాతా ఖానీ షాపులని వాటిద్వారా పీడిత ప్రజల ఏ ఒక్క మౌళిక సమస్య పరిష్కారం కాదంటూ, అసెంబ్లీకి రాజీనామా చేసి, భారత జనతా ప్రజాతంత్ర విప్లవం విజయవంతానికై ఇరుసు వంటిదైన వ్యవసాయ విప్లవోద్య మ నిర్మాణంకై అజ్ఞాతంలోకి వెళ్ళిన తరిమెల నాగిరెడ్డి చూపించిన విప్లవ మార్గంలోనే ప్రజల మౌళిక సమస్యలు పరిష్కారం అవుతాయే తప్పా మరోళా పరిష్కారం కావని ఇన్నేళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన,మరీ ముఖ్యంగా విపత్తుగా మారి ప్రజలప్రాణాలను బలికొంటున్న కరోనా మహమ్మరిని కట్టడి చేయడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తు న్న నిర్లక్ష్యమే నిదర్శనం. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలి న ప్రపంచ పెట్టుబడి దారీ, సామ్రాజ్యవాద దోపిడీని తేట తెల్లంచేసి -కమ్యూనిస్టుల నాయకత్వంలోని సోషలిస్టు వ్యవస్థ తక్షణావసరాన్ని ఎత్తి పట్టింది కరోనా.

ఒకవైపు 1990ల తర్వాత వచ్చిన ప్రపంపంచీకరణ (గ్లోబలైజేషన్)తో ప్రపంచమే కుగ్రామంగా మారగా సామ్రాజ్యవాద దోపిడీ, పీడనలు పెరిగి పోయా యి. మరోవైపు దేశంలో ప్రవేశ పెట్డబడిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలు,సంస్కరణలతో అన్ని రంగాల ప్రజలపై, ప్రత్యేకించికార్మిక వర్గంపై మూకుమ్మడి దాడీ పెరి గింది. ఈ క్రమంలో న్యాయంకై వెళ్ళు వెత్తిన నూతన సామాజిక ఉద్య మాలను పరిగణలోకి తీసుకుని, కార్మిక వర్గ పార్టీ నాయకత్వంలో కుల-వర్గ జమిలీ పోరా టాలను కలగలుపుకొని ముందుకే గాలనీ, విప్లవకర పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, తద్వారా సోషలిజాన్ని సిద్దింపజేయాలనే ఆశయంతో అసువులు బాసిన అమర వీరుల ఆశ యాల సాధన కోసం ఇతర ప్రజాతంత్ర, సామాజిక ఉద్యమాలతో, విప్లవ శక్తులతో యు.సి.సి.ఆర్.ఐ (ఎమ్ఎల్) కిషన్ వర్గం నిజయితీగా పని చేస్తున్నదని అమరుల సాక్షిగా నొక్కి చెప్పారు. కీలక సమయంలో ఉద్యమ నిర్మాణానికి అవసరమైన సలహాలు, సహాకారాన్ని అందించే ఉ.సా గారి మరణం తీరని లోటని పేర్కొన్నారు.

తంగెళ్ళ సుదర్శనం మాట్లాడుతూ.. మనకు స్వాతంత్ర్యం వచ్చిదని చెబుతున్నారు కాని ఆచ రణలో చూస్తే మన పాల కులు లౌకికత్వం, సౌభ్రా తృత్వం అనే పదాలు లేకుండా చేస్తూ, వాటిని ఏ కోషానా లెక్క చేయటం లేదు. ఎందుకంటే దేశంలోని అతికొద్ది మంది కేవ లం 5-10 శాతం మంది చేతుల్లోనే దేశ సంపదంతా పోగుపడుతూ అనేక సౌక ర్యాలు పొందుతున్నారని, కోట్లాది పేదలు ఏలాంటి కనీస సౌకర్యా లకు నోచుకోకుండా అనేక అవస్థల పాలౌతున్నారు. కాబట్టి మెజారిటీ ప్రజ లకు ఉపయోగపడని, మనకు వచ్చిన స్వాతంత్ర్యం సరైనది కాదన్నారు. కనీసం విద్యారంగాన్ని కూడా పట్టించుకోకుండా, అందరికీ సరైన విద్యను అందించాలనే 1996 కొఠారి కమిషన్ నివేదికను కూడాఅమలు చేయకుండా, విద్యను పూర్తిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.

సమాన విద్యా సాధనకై, కామన్ స్కూల్ విద్యా విధానం కోసం పోరాడా ల్సిన పరిస్థితే నేటికి నెలకొన్నది. అంతేకాదు పీడిత ప్రజలపై జరుగు తున్న దోపిడీ, అన్యాయా లను ప్రశ్నించే స్వేచ్చ కూడాలేదు. ప్రజలమాన,ప్రాణాలకు కనీస రక్షణ కరువైంది. ప్రజల పక్షాన మాట్లాడిన 81 ఏండ్ల వరవరరావును, 90 శాతం శరీర అవయవాలు పని చేయక కదలలేని స్థితిలో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబాను హక్కుల కార్య కర్తలను ఉ.పా కేసుల్లో అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించారు. అందుకే స్వంత ఆస్తిలేని, ప్రజలందరికీ సమాన అవ కాశాలు కల్పించే కమ్యూనిస్టు వ్యవస్థను సాధించు కోవాలన్నారు. దానికై కృషి చేసి తమ జీవితాలను అర్పించిన త్యాగధనుల అమరత్వం హిమాలయాల కన్న ఎత్తైనదనీ అమర వీరులకు జోహార్లు అర్పించారు. కమ్యూనిస్టులను అణచివేసే కుట్రలు తీవ్రమైన ఈరోజుల్లో ప్రజలకు తమ మంచి భవిష్యత్తు కోసం సాయుధంగా పోరాడటం తప్పా మరో మార్గం లేదని విప్లవ నేత లు చెప్పిన మాటలను ఆచరించటం తప్పా మరో మార్గం కనిపించడం లేదన్నారు.

ఉ.సా ప్రజలను విజ్ఞాన వంతం చేసేందుకు తన గంభీర స్వరంతో తనకు తెలిసిన విషయాన్ని ప్రజలకు చక్కగావివరించి అర్ధం చేయించేవారనీ, చాలాపాటలు వ్రాశారని, పేదకూలి మహిళలను దొరలు, భూస్వాములు ఎలా హింసించేవారో “జోలాలి – పాడాలి” అనే పాటలో కండ్లకు కట్టారనీ, ఆయన కరోనాతో మరణించడం సమాజానికి తీరని లోటంటూ, ప్రాణాంతక కరోనా నుండి కాపాడేందుకు వివిధ జైళ్ళలో నిర్బంధించబడిన ఖైదీలను, వరవరరావు, సాయిబాబా తదితరులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

పోరిక ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. జోలాలీ పాటను మేం చిన్నప్పటినుండి పాడుకుంటున్నాం. అది ఉ.సా. వ్రాసిందనీ ఇప్పుడే తెలిసిందనీ, అంతటి గొప్ప దళిత, గిరిజన, మహిళా, బహుజనుల పక్షపాతైన మేథావి ఉ.సా గారు మననుండి దూరం కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడంలో అనుసరిస్తున్న అలసత్వమే ప్రధాన కారణమన్నారు. ఉ.సా మరణం ఆదివాసి, గిరిజన, దళిత, బహుజనోద్యమాలకు తీరని లోటంటూ, ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలు సాధనకై కృషి చేద్దామన్నారు.

కొమ్ముల సురెందర్ మాట్లాడుతూ.. వలస వచ్చి దేశాన్ని ముక్కలు చేసిన ఆర్యులే బ్రాహ్మణి జంగా రూపొందారనీ అదే నేటి హిందూయిజమన్నా డు. అంబేద్కర్ దానిపైన తన జీవితకాలం పోరాడా డు, అంబేద్కర్,పూలే, మార్క్స్ ను అనుసరిం చిన ఆర్గానిక్ ఇంట లెక్షు వల్ ఉ.సా తనచివరి శ్వాస నొదిలే వరకూ విప్ల వకారుడిగా జీవించి, ఆదివాసీ, దళిత, మహి ళా, బహుజన, సామాజి కోద్యమాలకు బాసటగా నిలిచి, కుల- వర్గ సిద్దాం తాన్ని మనకందించాడు. ఎక్కడ దళితులపై లాఠీ జరిగిన పరుగెత్తుకెల్లే ఉ.సా, కె.ఏ.ఎన్. పి.ఎస్ వ్యవస్థాపకుడి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటంటూ ఆయన సేవలను కొనయాడి ఆయన ఆశయాలను కొనసాగిస్తా మని ప్రతిన బూనారు.

జున్ను సాంబయ్య మాట్లాడుతూ.. ఉ.సా గారు మొదట వరంగల్ లో శివసాగర్ (సత్య మూర్తి) గారితో పరిచయం అయ్యారంటూ, నిరుపేద దళితుడనైన తను ఈ రోజు రాజకీయాల్లో నిల దొక్కుకోవడానికి కారణమై, అన్నిసందర్భాల్లో మనోధైర్యాన్నిచ్చి ఆదుకొన్న మా రాజకీయ గురువు, ఉ.సా గారి మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆయన ఆశయాలను కొన సాగిస్తామన్నారు.

మండల కుమారస్వామి మాట్లాడుతూ.. ఉ.సా గారు ఈవేదికపై ఉన్న సదానందం, మరొక మిత్రుడు లక్ష్మయ్యలు నాగపూర్ లో ఈమధ్యనే జరిగిన కులనిర్మూలనా ఉద్య మం(CAM) సమా వేశానికి వచ్చినప్పుడు వారికి అంబేద్కర్, బౌద్దాశ్రమాలను దగ్గెరుండి చూపించాను. అప్పుడు ఉ.సా గారి ఔన్నత్యాన్ని గమనించాను,ఉన్నత విలువలుకలిగిన ఉత్తమ నాయకున్ని కోల్పోయామంటూ విప్లవ జోహార్లు అర్పించారు.

చివరగా గూడూరులో ప్రేమ పేరుతో కులపిశాచికి బలైన సుశృతా మేన మామ గుండే ప్రమోద్ ఒక్కసారన్న వచ్చిపోవ. . ఉ.సా సారూ.. అనే పాటతో అశృ నివాళి నర్పించి వందన సమర్పణ చేశారు.

Leave a Reply