అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

0
200

హనుమకొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఘటనలు 

దామెర, బోథ్‌ రూరల్‌ : ఎన్నో ఆశలతో రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటల దిగుబడి రాక.. అప్పు లు తీర్చే మార్గం లేక.. ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యా దెల్ల గ్రామానికి చెందిన లాండె కమలాకర్‌ (40) రెండేళ్లుగా పంటల దిగుబడి రాకపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో జీవితంపై విరక్తితో కమలాకర్‌ ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం నాగాపూర్‌కు చెందిన చౌహాన్‌ తారాసింగ్‌(50) రెండున్నర ఎకరాల్లో సోయాబీన్‌  సాగు చేయగా, వర్షాలతో పంట పాడైంది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక క్షోభతో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply