- ఢిల్లీలోని 3 కార్పొరేషన్ల పరిధిలో జారీ అయిన డెత్ సర్టిఫికెట్లు!
- ఒక్క మే నెలలోనే 24 వేలపైగా..
- గత ఏడాది ఏప్రిల్, మేతో పోలిస్తే 250 శాతం అధికం
- పెండింగ్‌లో దరఖాస్తులు.. సంఖ్య మరింత పెరిగే అవకాశం
- ప్రభుత్వ లెక్కల్లో మృతులు 13వేలే
- ఢిల్లీలోని 3 కార్పొరేషన్ల పరిధిలో జారీ అయిన డెత్ సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ : కేవలం రెండు నెలలు.. 35 వేల మరణ ధ్రువపత్రాల జారీ! ఢిల్లీలో ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విల య మిది. దేశ రాజధానిలో గతేడాది ఇదే నెలల్లో వైర్‌సతో 9,916 మంది చనిపోయారు. అంటే.. సెకండ్ వేవ్‌లో మరణాలు 250% అధికంగా సంభవించాయి. నిరుటి ఏప్రిల్ కంటే ఈ ఏప్రిల్‌లో మరణాలు రెండున్నర రెట్లు, మేలో నాలుగున్నర రెట్లు పెరిగాయి. ఒక్క మేలోనే 24 వేల ధ్రువపత్రాలు జారీ అయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ధ్రువపత్రం మంజూరు దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకొందరు ఇంకా దరఖాస్తే చేయలేదు. వీటినీ కలిపితే సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనాతో 13,201 మంది మృతి చెందారని ఢిల్లీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో 21 వేల పైగా తేడా ఉన్న నేపథ్యంలో వాస్తవ లెక్కలు తేలాలంటే..
అంత్యక్రియల సందర్భంగా జారీ చేసే రశీదులను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
Courtesy Andhrajyothi