రాజకీయ అనైతికతకు, వ్యవస్థల పతనానికి పరాకాష్ట ఉన్నావ్!

0
277

రచన బి భాస్కర్

ఉన్నావ్ బాలిక అత్యాచారం కేసు మన రాజకీయాల నైతికతను, పోలీసు న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నది. చిన్న పట్టణ బాలికపై లైంగిక దాడులు జరిగితే అసలు ఫిర్యాదు చేసేందుకే భయపడుతుంది. అలాంటిది ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ తనను 11 ఏళ్ల వయసప్పటి నుంచి అత్యాచారం చేస్తూ వచ్చాడని, ఇటీవల సామూహిక  అగాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక ఫిర్యాదు చేసింది.. కేసు ముందుకు సాగకపోవడంతో బాధితురాలు 2018 ఏప్రిల్ 8న ముఖ్యమంత్రి నివాసం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించింది అప్పుడు కానీ ఈ కేసు జాతీయ మీడియా దృష్టిలో ప్రాధాన్యత సంతరించుకోలేదు.

ఇక తర్వాత ఏం జరిగిందో గమనించండి. బాలిక తండ్రి పోలీసు కస్టడీలో చనిపోయాడు ఎట్టకేలకు నేరస్తుడు అయిన ఎమ్మెల్యేపై కేసు నమోదయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే సంబంధీకులు బాధితురాలి కుటుంబసభ్యులను బెదిరిస్తూ వస్తున్నారు.. దీంతో తమకు తమ కుటుంబ సభ్యులకు ఈ ప్రాణభయం ఉందని తమకు రక్షణ కల్పించాలని ఈ కుటుంబం అధికారులకు 35 లేఖలు రాశారు. ముఖ్యమంత్రికి, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కి , పోలీస్ చీఫ్కి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విజ్ఞాపనలు పంపుతున్న దిక్కులేదు . కోర్టులో అసలు ఏమి పట్టించుకోలేదు అని కూడా లేదు. ఎంతో కొంత కదలిక కారణంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. ప్రత్యేక కోర్టుకి కేసు అప్పగించారు కానీ న్యాయమూర్తి లేరు. తాత్సారమే తాత్సారం. చివరికి బాధితులు అనుకున్నట్లే జరిగింది. బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు లాయర్ ప్రయాణిస్తున్న కారును నెంబర్ ప్లేట్లు లేని లారీ ఢీకొంది. ముఖ్య బంధువుల , లాయర్ మరణాలు. బాధితురాలయిన బాలిక ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నరకం అనుభవిస్తుంది .

మనకు పోస్కో కేసు ఉంది. నిర్భయ చట్టం ఉంది. ఏంలాభం. నిందితులు రాజకీయంగా, ధన పరంగా అత్యంత శక్తివంతుల అయితే వారిని చట్టాలు అధికార వ్యవస్థ ఏమీ చేయలేవు అన్నమాట.లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి ఎంపీ సాక్షి మహారాజ్ స్వయంగా జైల్లోకి వెళ్లి నిందితుడైన ఎమ్మెల్యేన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పి వచ్చారంటే ఇక బిజెపి రాజకీయ నైతికత ఏ పాటిదో, తమది విభిన్నమైన పార్టీ తాము విభిన్నమైన పాలన అందిస్తామని చెప్పుకునే ఆ పార్టీ అగ్రనేతలు జవాబు చెప్పాలి.

ఈ దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం డబ్బు పలుకుబడి ఉన్న వారి చేతిలో మారిందని సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏదైనా వెలిబుచ్చుతున్నారు. పార్టీలకు బలగం, బలం, సంపత్తి కలిగి దందాలు చేయగలవారు కావాలి. ఎన్నికల్లో గెలిపించేది వారే మరి! అందువల్లనే అలాంటి వారు ఏం తప్పు చేసినా పార్టీలు కంటికి రెప్పలా కాపాడుకుం తాయి. రేసులోయోగిరాజ్ ఎన్కౌంటర్లు, మైనారిటీలపై దాస్ టీకాలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ది. అయితే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాత్రం మొన్న యూపీ వెళ్లి సీఎం అడ్మినిస్ట్రేషన్ ను పొగిడే వారు వచ్చారు.

19 జనవరి నుంచి జూన్ వరకు 24212 పోస్కో కేసులు నమోదయ్యాయి. కేవలం పన్నెండు వేల కేసులో చార్జిషీట్ నమోదు కాగా 911 కేసులో తీర్పు అంటే నాలుగు శాతం కేసుల్లో మాత్రమే తీర్పులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు లేఖ పంపితే స్వయంగా సీజే నా కాల్లేఖ ఇవ్వలేదు ఏమిటని రిజిస్ట్రీనే ప్రశ్నించాల్సి వస్తే …. ఇక ఎవరు మాత్రం ఎవరికి చెప్పుకోవాలి!

దేశ రాజకీయాల్లో అనైతికతను, న్యాయ పోలీస్ అధికార యంత్రాంగం పనితీరును నొక్కి చెప్పుకునేందుకు ఉన్నావు కేసు ఒక తాజా ఉదాహరణ. ఇలాంటివి ఇంతకుముందు జరిగాయి. ఇకముందు జరగవన్న గ్యారెంటీ ఏమీ లేదు. దేశ  రాజధానిలో నిర్భయ అత్యాచార ఉదంతం జరిగినప్పుడు నిందితులను శిక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. నేడు అలాంటి ఉద్యమాలు అడుగడుగునా జరగాల్సిన అవసరం ఉన్నది.

( రచయిత సీనియర్ జర్నలిస్టు)

Leave a Reply