భోపాల్: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాస్కు పెట్టుకుని తిరుగుతున్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడు “నేను వికాస్ దూబేను, కాన్పూర్ వాలా” అని గట్టిగా అరవడం గమనార్హం.
#WATCH Madhya Pradesh: Vikas Dubey, the main accused in #KanpurEncounter case, has been arrested in Ujjain pic.twitter.com/pmh5rwl3Z4
— ANI (@ANI) July 9, 2020
కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు అతని నలుగురి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌స్టర్‌కు అత్యంత సన్నిహితుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు మంగళవారం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు ఉంది. వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని పోలీసులు గురువారం హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలిపారు.
దీంతో ఇప్పటివరకు అతని ముగ్గురు అనుచరులు మరణించారు. ఇక హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ హోటల్‌లో వికాస్ దూబే ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం రాగా వారు అక్కడికి చేరుకునేసరికి పరారయ్యాడు. తాజాగా అతడు నోయిడాలో ఓ ఆటోలో వెళ్తున్నట్లు పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నోయిడాలో అతని కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. అనంతరం వికాస్ దూబే ఉజ్జయినిలో ప్రత్యక్షమయ్యాడని తెలుసుకున్న పోలీసులు ఈసారి అతడు పారిపోవడానికి వీలులేకుండా చాకచక్యంగా వ్యవహరించారు. ముప్పేట దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
దూబే అనుచరుడికి కరోనా పాజిటివ్
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మంగళవారం దూబె ప్రధాన అనుచరులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వీరిలో ప్రభాత్ అనే వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు అనుచరుల్లో తండ్రీ కొడుకులైన అంకుర్, శ్రవణ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో జైలులోని ఓ ప్రత్యేక గదిలో అతడ్ని ఉంచారు.
#WATCH सरकार जो उचित समझे वो करे, हमारे कहने से कुछ नहीं होगा। इस समय वो (विकास दुबे) भाजपा में तो है नहीं, सपा(समाजवादी पार्टी) में है: सरला देवी, विकास दुबे की मां pic.twitter.com/4TNdE0tqdJ
— ANI_HindiNews (@AHindinews) July 9, 2020
ఇక వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబెను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వికాస్ దూబె తల్లి సరళాదేవి స్పందించారు. ప్రతీ సంవత్సరం తన కుమారుడు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటాడని, ఆ అమ్మవారే వికాస్‌ను రక్షంచిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది మంచి అనిపిస్తే అది చేస్తుందని తగిన శిక్ష వేస్తుందని తెలిపింది.
Courtesy Sakshi