రెండు దశాబ్దాల పరిచయం, ఉద్యమ పితామహుడు, వ్యక్తిగతంగా తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్న ఊసా నుంచి నేర్చుకునే అంశాలు ఏవన్నా ఉన్నాయంటే అది ప్రజలని ప్రేమించడం, పీడితుల పక్షాన నిర్మొహమాటంగా నిలబడడం, ఉద్యమాలని ఊపిరిగా భావించడం, ద్వేషం కన్నా ప్రేమ గొప్పది అని పాఠాలు బోధించడం.
ఒక కార్య కర్తగానె క్షేత్రంలో దిగుతూ, మేధావిగా విశ్లేసిస్తూ, ఉద్యమాన్ని నిర్మిస్తూనే చట్టపరంగా కూడా మార్పులు తేవాలని డిమాండ్ చేస్తాడు. అదే క్రమంలో భాదితులకు అండగా ఉంటూ అన్ని రకాల అవసరాల్ని తీరుస్తూ, అన్నగా, తండ్రిగా, ఉద్యమ నేతగా భారోసానివ్వడం చాలా అరుదుగా చూస్తాం. తరువాత ఆ అంశం గురించి రాసి భద్రపరచడం. అయన కొనసాగించిన అనేక ఉద్యమాల సారాన్ని చిన్న పిల్లలనుండి పెద్ద వాళ్లకి బోధించడం, అతి సులభంగా అర్థం అయ్యేట్టు చూడడం. జ్ఞాన్నాన్ని పది మందికి పంచాలన్నది ఎప్పుడు చెపుతూ ఉంటాడు. అందరూ కుల నిర్మూలన దిశగా పని చేయాలని, అది జరగనిదే ఈ దేశంలో ఏ మార్పు జరగదని, అదే క్రమంలో వర్గ పోరాటాన్ని కూడా కొనసాగించాలని చెప్పీవారు. విమర్శ ఎప్పుడూ మన ఎదుగుదలకి తోడ్పడుతుంది. అయన విమర్శిస్తున్నాడని కొందరు దూరం పెడతారు కానీ అయన మనసులో బలంగా అందరిని కలుపుకొని పోవాలన్న తపననె ఉంటుంది.

నా వంతుగా ”దేశీదిశ”ని డిజిటైజ్ చేసి అయన రచనలు, అయన ఆలోచనలు, సమకాలీన అంశాలు, ఉద్యమాలు ఒక్క తాటిపై తేవాలని కోరిన వెంటనే ఆ పనిలో నిమగ్నమై నిరంతరం పని చేశారు.
ఉద్యమాలు అందరూ కాకున్నా కొందరు చేస్తారేమో అయితే దానికి కావలసిన డబ్బు కొద్దీ మేరకు పెట్టగలుగుతారు కానీ ఊసా తన గురించి తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఒక్కరిదగ్గరా ఒక్క పైసా కూడా తీసుకోకుండా తన దగ్గర ఉన్నదంతా పెట్టడం బహుశా నా జీవితంలో నేను వేరే ఎవరి దగ్గరా చూడలేదు. మేము ఉద్యమాల కోసం అప్పులు చేసిన రోజులున్నాయి కానీ అయనలాగా మాత్రం కాదు. డబ్బు ఉంటె అందరం భోజనం చేస్తాం లేదా చాయ్ బిస్కెట్ తాగుతూ నడిపిస్తాం. ఎప్పుడో గాని మాలాంటి వాళ్ళం అయన చేసే పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూవుంటాం..
మళ్ళీ ఆయన రారు, అయన లేని లోటు పూడ్చలేమేమో అని బెంగగా ఉంది. అన్నీ నేర్పిస్తూ ఉన్నట్టే, ఈ గడ్డు సమయాన్ని ముందుంచి, ముందు ముందు భాధలు వస్తే తట్టుకొనెటట్టు తయారు చేయడానికేమో బాధని మాత్రం మిగిల్చి వెళ్ళాడు సార్ . ఈ పాఠం మాత్రం జీవితాతంతం మరువలేను.
శిష్యురాలు సుజాత సూరేపల్లి