రెండున్నరేండ్ల నిరీక్షణ

0
47

– పత్తాలేని రైల్వే ఉద్యోగాలు..
– లోక్‌సభ ఎన్నికలకు మోడీసర్కార్‌ గాలం

ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారతదేశం. కానీ ఈ యువతరం భవిష్యత్‌తో మోడీ సర్కార్‌ చెలగాటమాడుతున్నది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ ద్వారా నోటిఫికేషన్‌ ప్రకటించి, మొదటిదశ పరీక్షలు నిర్వహించలేదు.. రెండున్నరేండ్లయినా.. కేంద్రం నుంచి ఉలుకుపలుకూలేదు. రైల్వేను ప్రయివేట్‌ పరం చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగాల గురించి మర్చిపోయిందని స్పష్టమవుతున్నది. దీంతో మోడీ ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహంవ్యక్తమవుతున్నది.

న్యూఢిల్లీ : రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా మంటూ.. స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేస్తామంటూ.. అన్నదాతల్ని మాయచేసి మోడీ సర్కార్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చింది.
రెండోసారి ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని భ్రమల్లో పెట్టి..మరోసారి అధికారపీఠాన్ని దక్కించుకున్నది. ఇలా అవసరాన్ని బట్టి..రాజకీయం చేసి గద్దెనెక్కటం బీజేపీ సర్వసాధారమైపోయింది. ఏడేండ్ల తర్వాత మోడీ జమానాలో అటు రైతుల్ని దెబ్బతీసేలా నల్లచట్టాలను తెరపైకి తెచ్చింది. నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్న రైల్వే ఉద్యోగాలను భర్తీ చేయకుండా రెండున్నరేండ్ల నుంచి నాన్చుతునే ఉన్నది. ఇంతకీ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏం చేస్తున్నది..?ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారా..!లేదా అన్నది తెలియటంలేదన్న భావన దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నది. అయినా యువత ఇంకా ఆశతో ఎదురుచూస్తున్నది.

లక్షకు పైగా పోస్టుల భర్తీ అంటూ బురిడీ…
2019 లోక్‌ సభ ఎన్నికలకు ముందు.. రైల్వేలో లక్షకు పైగా పోస్టుల హామీతో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) బంపర్‌ రిక్రూట్‌మెంట్‌ అంటూ ప్రకటిం చింది, ఆ తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువత తమ భవిష్యత్‌ పై ఆశలు పెట్టుకున్నది. ఎందుకంటే నిరుద్యోగం తీవ్రమవుతున్న తరుణంలో…ఆర్‌ఆర్‌బీ నుంచి అలాంటి ప్రకటన రావటంతో ఊరటనిచ్చింది. కనీసం ఈసారైనా రైల్వే ఉద్యోగిగా అవుదామనుకుని, పోటీపడి కోచింగ్‌ సెంటర్లకు పరుగులుదీశారు. భారీగా ఫీజులు సమర్పించుకున్నారు. కానీ రెండున్నరేండ్లయినా మోడీ ప్రభుత్వం తేల్చటంలేదు. అయితే రైల్వే నోటిఫికేషన్‌ జారీ చేసిన సమయంలో సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన డేటా విడుదల చేసింది. అనాడు దేశంలో నిరుద్యోగ రేటు (2019 ఫిబ్రవరిలో) 7.2 శాతంగా ఉన్నది. 2018లో కోటి మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు సీఎంఐఈ డేటా స్పష్టం చేసింది.ఇపుడు దేశం నిరుద్యోగభారతంలా మారిందని పలు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్‌ ఇలా..
నేషనల్‌ ధర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ), రైల్వే లో గ్రూప్‌-డి నియామకాల కోసం 2019 మార్చి1, మార్చి12న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాయి, దాదాపు 1.4 లక్షల పోస్టుల కోసం 2.4 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సర్కార్‌ ఉద్యోగాల కోసం పెద్దపెద్ద సంఖ్యలో పోటీపడ్డారు.ప్రయివేట్‌ రంగం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువత కూడా ఈ 1.4 లక్షల పోస్టులలో తమకంటూ ఒకఛాన్స్‌ దక్కదా అనే..ఆశతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

అప్పటినుంచి ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.మోడీ అనుకున్నట్టు ఎన్నికలయ్యాయి. అత్యధిక మెజార్టీతో అధికారం దక్కింది. కానీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసిన నిరుద్యోగులు ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తున్నారు.

పరీక్షలో జాప్యం కారణంగా కలత చెందిన రైల్వే పరీక్షలు రాసిన అభ్యర్థులు,స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దరఖాస్తు చేసుకున్న వారు కలిసి.. సంయుక్తంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు, చ%ూజూవaసఖజూఖీశీతీూూజ=aఱశ్రీషayూ్‌బసవఅ్‌ర సోషల్‌ మీడియాలో పలు వేదికలపై తమ నిరసన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరుద్యోగ సెగలు దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా తాకాయి. దీంతో మోడీ సర్కార్‌ దిగివచ్చి ఎన్టీపీసీ ఉద్యోగాలకు పరీక్షల తేదీని ప్రకటించింది. కానీ గ్రూప్‌..డీ విషయంలో మాత్రం నోరువిప్పలేదు.

మళ్లీ మొండిచెయ్యే…
ఎట్టకేలకు 2020 సెప్టెంబర్‌ 5న ఎన్టీపీసీ మొదటి దశ పరీక్ష తేదీలను ప్రకటించింది.ఆ పరీక్ష కోసం అభ్యర్థులు ఎంతగానో శ్రమించారు. చివరకు పరీక్ష తేదీని ప్రకటించింది. కానీ గ్రూప్‌-డి పరీక్ష తేదీలు ఇప్పటికీ ప్రకటించలేదు. దీనిపై నిరంతరం ట్విట్టర్‌ పోస్టులు పెడుతున్నారు. తమ గొంతుకను వినిపిస్తున్నారు.

ఉన్న ఉద్యోగం పోయే…
లక్షకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించాక.. ప్రయివేట్‌ జాబ్‌ ను వదిలి సర్కారు నౌకరీ కోసం దరఖాస్తు చేశా. ఇంతవరకూ పరీక్ష నిర్వహించలేదు. ఉన్న ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డా.        -ఈశాన్య ఢిల్లీకి చెందిన సోను,

ఎన్నికల ఫలితాలు సమయానికి వస్తాయి. నేతలకు అధికారం దక్కుతున్నది. హౌదాలు వస్తాయి.కానీ ప్రభుత్వ నియామకాలకు కాలపరిమితి ఎందుకు లేదన్న ఆక్రోశం నిరుద్యోగుల్లో వ్యక్తమవు తున్నది.మా భవిష్యత్‌ అనిశ్చితంగా మారటానికి బీజేపీ సర్కారే కారణమంటూ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియ మూడేండ్ల దాకా పడితే..యువశక్తి గురించి మాట్లాడే మోడీ…వారి విలువైన సమయం వృధా కాదా అని ఆలోచించరా..!. అసలింత వరకూ మొదటి దశ ప్రక్రియనే షురూ కాలేదు.
నోటి ఫికేషన్‌ జారీ నుంచి తుది జాయినింగ్‌ వరకు ఐదేండ్లు లేదా..అంతకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటికే తమ అర్హత వయసు దాటిపోతుందనే ఆందోళన దరఖాస్తు దారుల్లో వ్యక్తమవుతున్నది.డిజిటల్‌ ఇండియా వైపు భారత్‌ దౌడు తీస్తున్నదంటున్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాల నియామకం వైపు ఎందుకు దృష్టిపెట్టడంలేదు..? రెండేండ్లుగా తాము పడుతున్న నిరీక్షణ గురించి బీజేపీ సర్కారే సమాధానం చెప్పాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

అసలేం జరిగింది.?
– 2019..ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు ఏడువిడతలుగా సార్వత్రిక ఎన్నికలు.
– బంపర్‌ భర్తీ అంటూ రైల్వే నోటిఫికేషన్‌.. 2019 మార్చి 12న రైల్వే గ్రూప్‌-డి నియామక నమోదు ప్రక్రియ షురూ.. ఇంతవరకూ ఆ ఉద్యోగాలు ఏమాయ్యాయో..ఇప్పటికి వీడని మిస్టరీ

Courtesy Nava Telangana

Leave a Reply