కరోనా నివారణలో వైట్హౌస్ వైఫల్యాలు…!

0
218

– ఎండగట్టిన వాషింగ్టన్‌ పోస్ట్‌..

వాషింగ్టన్‌: దేశంలో వేలాది మందిని బలితీసు కుంటున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవటంలో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఘోరంగా విఫల మైందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక తన తాజా సంచిక సంపాదకీయంలో ఎండ గట్టింది. కరోనా వైరస్‌ విషయంలో వైట్‌హౌస్‌ ప్రధానంగా నాలుగు విషయాల్లో విఫలమైందని ఈ పత్రిక పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్‌ను గుర్తించేందుకు అవస రమైన డయాగస్టిక్‌ పరీక్షను రూపొందించే విషయంలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ)పై మితిమీరిన నమ్మకం పెట్టుకోవటం, కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపు తప్పుతున్నప్పటికీ, పరిస్థితిని తప్పుగా అంచనా వేసి నిర్లక్ష్యం వహించటం, నిధుల కేటాయిం పుపై అనవసర వాద, ప్రతివాదనలతో విలువైన సమ యాన్ని వృథా చేయటం, దీనితో పాటు నాయ కత్వంలో అంతర్గత పోరు, నాయకత్వ మార్పులు కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ విధులకు తీవ్ర విఘాతం కలిగించాయని పోస్ట్‌ పత్రిక వివరించింది. అధి కారులు, ఆరోగ్య నిపుణులు, ప్రజారోగ్య నిపుణులు, ఇంటెలిజెన్స్‌ అధి కారులు, తదితరులతో దాదాపు 47 ఇంటర్వ్యూల ద్వారా తాము సేకరించిన సమా చారాన్ని విశ్లేషించినపుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయని ఈ పత్రిక వివరించింది. కరోనా వైరస్‌ దేశాన్ని కమ్ముకుంటున్నా, వైట్‌హౌస్‌ మాత్రం ఇందుకు సంబంధించిన హెచ్చరికలను పెడచెవిన పెట్టిం దని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ప్రారంభమైన తొలి 70 రోజుల్లో వైట్‌హౌస్‌ అనేక అంశాలలో విఫలం కావటం ఈ మహమ్మారికి రెక్కలు తొడిగిందని వెల్లడించింది.

ఏడు లక్షలు దాటిన కేసులు
జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం అమెరికా దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి 7,35,000 కేసులు, 16,000 మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా న్యూయార్క్‌ రాష్ట్రం కరోనా కేసుల్లో ప్రధమ స్థానంలో నిలిచింది.

Courtesy Nava Telangana

Leave a Reply