కసబ్‌పై సాక్ష్యం చెప్పి.. ఒంటరయ్యాం

0
282

  • నాపై కాల్పులు జరిపింది కసబేనని చెప్పా
  • కసబ్‌ దాడిలో గాయపడిన బాధితురాలు

ముంబైముంబై 26/11 ఉగ్రదాడి అప్పుడు ఆమెకు పదేళ్లు. ఇప్పుడు 21 ఏళ్లు. కాల్పులకు తెగబడిన లష్కరే ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ తూటాలకు ఎందరో నేలకొరుగుతుండటాన్ని కళ్లారా చూడటమే కాదు.. తానూ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో కోలుకొని ఊతకర్రల సాయంతో కోర్టు హాల్లో నడుస్తూ ‘‘నాపైన కాల్పులు జరిపింది ఇతడే’’ అంటూ కసబ్‌ను గుర్తించిన ధీశాలి! పేరు దేవికా రోతవన్‌. నాటి దాడి, ఆ తర్వాత పరిణామాలను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’అనే ఫేస్‌బుక్‌ పేజీలో దేవిక కళ్లకు కట్టింది. ‘వాడి(కసబ్‌) మొహం నాకు బాగా గుర్తుంది. వాడు జరిపిన కాల్పుల్లో ఎంతోమంది మహిళలు, పిల్లలు చనిపోవడం చూశాను. కోర్టులో నేను సాక్ష్యం చెప్పడంతో ప్రాణభయంతో మా కుటుంబసభ్యులు వణికిపోయారు’ అని దేవిక చెప్పింది.

సాక్ష్యం చెప్పి న తర్వాత సమాజంలో తమ కుటుంబం పూర్తి గా ఒంటరైపోయిందని వాపోయింది. ‘అప్పటిదాకా మా కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారంతా దూరమయ్యారు. మా నాన్న తన పండ్ల దుకాణాన్ని మూసేయాల్సివచ్చింది. ఇల్లు కట్టిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట ఇప్పటికీ నెరవేరలేదు. అయినా మాకేమాత్రం బాధలేదు. మేం ఏం చేసినా దేశం కోసమే చేశాం’ అని గర్వంగా చెప్పింది. దేవిక పోస్టుకు నెటిజెన్లు భారీగా స్పందించారు. ఆమె తెగువ, ధైర్యాన్ని కొనియాడుతూ వందలకొద్దీ కామెంట్లు రాశారు.

Courtesy AndhraJyothy…

Leave a Reply