అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా ఎందుకు?

0
168
అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా ఎందుకు?
Image result for Malavath Poorna"అవకాశం ఇస్తే ఏదైనా చేయగలమని చాటాను
నా ఫిట్‌నెస్‌ రహస్యం జాగింగే.. రోజూ 20 కిలోమీటర్లు పరిగెడతా
ఉత్తర అమెరికాలోని డెనాలీతదుపరి లక్ష్యం.. పూర్ణ
అవకాశం ఇస్తే ఏదైనా చేయగలమని చాటాను..
విన్సన్‌ మసిఫ్‌ పర్వతారోహణ ఎంతో భిన్నం
అనుకోకుండానే పర్వతారోహణను ఎంచుకున్నా
 మాలావత్‌ పూర్ణ

హైదరాబాద్‌: అమ్మాయిలు ఏ రంగంలోనైనా రాణించగలరని.. వారు ఏదైనా చేయగలని నిరూపించాలనే తానూ పర్వతారోహణను కెరీర్‌గా ఎంచుకున్నానని మాలావత్‌ పూర్ణ అన్నారు. 4,892 మీటర్ల ఎత్తుతో అంటార్కిటికా ఖండంలోనే పెద్దదైన విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని నాలుగు రోజుల క్రితం పూర్ణ దిగ్విజయంగా అధిరోహించారు. ఇప్పటి దాకా ఆరు పర్వతాలను అధిరోహించిన పూర్ణ, తన తదుపరి లక్ష్యం ఉత్తర అమెరికాలోని 6వేల మీటర్ల ఎత్తయిన ‘డెనాలీ’ పర్వతాన్ని అధిరోహించడమేనని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

విన్సన్‌ మసి్‌ఫకు ముందు ఐదు పర్వతాలను అధిరోహించారు కదా! వాటికి దీనికి తేడా ఏం అనిపించింది?
చాలా తేడాలున్నాయి! మిగతావాటికి విన్సన్‌ మసిఫ్‌ పూర్తిగా భిన్నమైనది. ఈ పర్వత ప్రాంతంలో 24 గంటలు పగలు ఉంటే.. మిగిలిన 24 గంటలు రాత్రి ఉంటుంది. మిగిలిన చోట్ల పర్వతారోహణ సమయంలో మన వస్తువులన్నీ మోయడానికి పోర్టర్స్‌ ఉంటారు. ఇక్కడ నా వస్తువులు, ఆహార పదార్థాలను నేనే మోసుకోవాల్సి వచ్చింది. అవన్నీ కలపి 25-30 కేజీల దాకా బరువు ఉండటంతో కొంచెం కష్టమైంది. ‘విన్సన్‌ మసి్‌ఫ’లో వెంట గైడ్సే ఉన్నారు.
ఈ పర్వతారోహణకు ఎంత సమయం పట్టింది? ఎటువంటి సాధన చేశారు?
‘విన్సన్‌ మసిఫ్‌’ ఎక్కేందుకు దాదాపు పది రోజులు సమయం పట్టింది. విపరీతమైన చలిగాలులతో మధ్యలో వాతావరణం అనుకూలించలేదు. పర్వతారోహణ కోసం ప్రత్యేకంగా సాధన అంటూ ఏమీ చేయను. శరీరం ధృడంగా ఉంచుకునేందుకు ఉదయం 10 కిలోమీటర్లు, సాయంత్రం 10 కిలోమీటర్లు జాగింగ్‌ చేస్తా. నా కోచ్‌ దాచినేపల్లి శేఖర్‌. ఆయన ఆధ్వర్యంలోనే పర్వతారోహణ విషయంలో మెళకువలు నేర్చుకున్నా. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్ని విధాలుగా నన్ను ప్రొత్సాహించారు.
పర్వతారోహణలో ఎటువంటి ఆహారం తీసుకున్నారు?
ఎక్కువగా నాన్‌ వేజ్‌ ఇస్తారు. ప్రధానంగా చికెన్‌, మటన్‌, గుడ్లు తీసుకుంటాను. అలాగే ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ ఉంటుంది.
సహజంగా అమ్మాయిలు ఇటువంటి హార్డ్‌ టాస్క్‌ ఎంచుకోరు. మీరు ఇది ఎంచుకోవడానికి కారణాలేంటి?
అమ్మాయిలు ఏదైనా చేయగలరని నిరూపించాలనుకున్నా. వారికి అవకాశం కల్పిస్తే, ఎందులోనూ తీసిపోరు. కావాల్సిందల్లా వారిలో ఆత్మవిశ్వాసం కల్పించడమే. నేను ఈ రంగంలోకి అనుకోకుండా వచ్చాను. ప్రపంచంలోని ఎత్తయిన ఏడు పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యం పెట్టుకున్నా. ఆ దిశగా అడుగులు వేస్తున్నా.
మీ తదుపరి లక్ష్యం?
త్వరలోనే ఉత్తర అమెరికాలోని 6 వేల మీటర్త ఎత్తుగల డెనాలీ పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నా. ఇంకా డేట్‌ ఎప్పుడన్నది నిర్ణయించుకోలేదు.
ప్రస్తుతం ఏం చదువుతున్నారు? మీకు సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి?
ఇప్పుడు నేను అమెరికాలోని మినెసోట స్టేట్‌ యూనివర్సిటీలో వన్‌ ఇయర్‌ ఎక్సేంజ్‌ స్టూడెంట్‌గా చేరాను. అండర్‌ గ్రాడ్యుయేట్‌ చేస్తున్నా. 2019 ఆగస్టులో అక్కడికి వెళ్లాను. అక్కడ ఓ స్పాన్సర్‌ దొరికారు. వారి సహకారంతోనే కోర్సు చేస్తున్నా. వచ్చే ఏడాది మళ్లీ భారత్‌కు వస్తాను. నాకు అందే సహాయ సహకారాలు, ఆర్థిక సహకారం అంతా మా కోచ్‌ శేఖర్‌ చూస్తారు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply