వాగు ఒడ్డే పాన్పు.. అక్కడే కాన్పు!

0
119

వాగులు, వంకల కష్టాలు గర్భిణులను వీడడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ పరిధి మామిడిగూడ(జి)కు చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. సోమవారం ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలిస్తుండగా మామిడిగూడ వాగు ఉద్ధృతి పెరిగింది. నొప్పులు తీవ్రం కావడంతో గర్భిణి వాగు ఒడ్డునే ప్రసవించింది. విషయం తెలుసుకుని పిట్టబొంగరం పీహెచ్‌సీ హెచ్‌ఈవో అశోక్‌, వాల్గొండ ఏఎన్‌ఎం జానాబాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు. గ్రామస్థుల సాయంతో బాలింత, పసిబిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. వారినలాగే 1.5 కి.మీ. మేర నడిపించుకుంటూ మామిడిగూడ(ఎ) గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించారు.

Leave a Reply