భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్‌ రేప్‌

0
22
  • కర్రలతో కొట్టి.. కొడవళ్లతో బెదిరించి..
  • బైక్‌పై వెళుతున్న దంపతులపై దాడి
  • భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యం
  • పొలాల్లోకి ఈడ్చుకెళ్లి 2 గంటలు నరకం
  • గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి మరో దారుణం
  • కృష్ణా ఘాట్‌ ఘటనను తలపించిన ఘోరం

గుంటూరు : ప్రియుడి ఎదుట ప్రియురాలిపై కృష్ణానది ఘాట్‌లో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన ఘటన మరవకముందే అలాంటిదే మరో ఘోరం! భర్త ఎదుటే భార్యను రెండుగంటలకుపైగా చెరపట్టిన దారుణం అదే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గుంటూరుజిల్లా సత్తెనపల్లికి చెందిన బాధితురాలు కూలిపనులకు వెళుతుంది. ఆమె భర్త డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. బాధితురాలి మేనత్త మనవడికి 21 రోజుల స్నానాలు కావటంతో శుభకార్యం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం కోసం బుధవారం భార్యాభర్తలు పాలడుగు వెళ్లారు. అదేరోజు రాత్రి 9 గంటలకు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి బయలుదేరారు. పాలడుగు దాటగానే రోడ్డు మలుపు వద్ద రోడ్డుకడ్డంగా చెట్టు కొమ్మలు పడిఉండటం కనిపించింది. ఎవరో వాటిని నరికి అక్కడ పడేశారు.  కొమ్మలను తప్పిస్తూ వాహనాన్ని రోడ్డు మార్జిన్‌లోకి దించారు. ఇంతలో అక్కడే పొంచిఉన్న నలుగురు ఆగంతకులు కర్రలు అడ్డుపెట్టడంతో వాహనం పడిపోయింది. దానితోపాటు కింద పడిపోయిన దంపతులపై వారు మూకుమ్మడిగా దాడిచేసి.. తీవ్రంగా గాయపరిచారు. అనంతరం వారిద్దరినీ పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. భర్తను కొట్టి అతని ఒంటిపై ఉన్న చొక్కా, బనియన్‌ చింపేశారు. వాటితోనే అతని చేతులు కట్టేశారు. భార్యను అక్కడికి సమీపంలోని చెట్టుకిందకు ఈడ్చుకెళ్లి ఆమెకు రెండున్నర గంటలపాటు నరకం చూపించారు.

సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె నుంచి బంగారపు ఉంగరం, చెవిపోగులు, మాటీలు, మంగళసూత్రం, కాళ్ల వెండి పట్టీలు, రూ.3,100 నగదును గుంజుకున్నారు. భర్త వద్ద ఉన్న రూ.1500ను లాగేసుకున్నారు. ‘ఎవరికైనా చెబితే చంపేస్తాం’ అని కొడవళ్లతో బెదిరించారు. అనంతరం  పరారయ్యారు. బాధిత దంపతులు నేరుగా సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన స్థలం మేడికొండూరు స్టేషన్‌ పరిధిలో ఉంది. సత్తెనపల్లి పోలీసులు బాధిత దంపతులను అక్కడకు తీసుకెళ్తుండగా ఈ లోపు మేడికొండూరు పోలీసులు ఎదురు వెళ్లి, వారిని తమ వాహనంలోకి ఎక్కించుకొని ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడి పరిసరాల్లో గాలింపు జరిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్‌రే్‌పకు ఒడిగట్టిన నిందితులు పోలీసులను పక్కదారి పట్టించేలా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తొలుత వారు తెలుగులో మాట్లాడినప్పటికీ, మధ్యలో ఒకటి, రెండు సార్లు హిందీలో మాట్లాడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలానికి సమీపంలో కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మాణం జరుగుతోంది. అక్కడ కొద్ది నెలలుగా ఒడిసా, విజయనగరం జిల్లాకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో నిందితులకు సంబంధించి అనుమానిస్తున్న రెండు జతల చెప్పులు లభ్యమయ్యాయి. పోలీసు జాగిలం ఆ చెప్పుల వాసననుబట్టి పొలంలోకి వెళ్లి తర్వాత రోడ్డుపైకి వచ్చింది. దీంతో పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు.

దారిదోపిడీ దొంగల పనా?
వివాహిత యువతిపై దారిదోపిడీ దొంగల ముఠానే గ్యాంగ్‌రే్‌పకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. తొలుత ఈ ముఠా ద్విచక్ర వాహనంపై ఉన్నవారిని కొట్టి దోచుకోవాలని భావించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు అదే మార్గంలో ఓ ఆటో వెళ్లింది. ఆ ఆటోలో ఎక్కువమంది ప్రయాణికులు ఉండటంతో దోపిడీకి కుదరలేదని, దంపతులు స్కూటర్‌పై రావడంతో దాడిచేశారని భావిస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply