వివాహితపై కీచకపర్వం

0
57
  • సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు
  • హైదరాబాద్‌ నుంచి ఆటోలో తీసుకెళ్లి జహీరాబాద్‌ శివార్లో అరాచకం
  • అపస్మారక స్థితిలో కనిపించిన మహిళ.. ఆలస్యంగా వెలుగులోకి

జహీరాబాద్‌, సెప్టెంబరు 25: భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. హైదరాబాద్‌కు చెందిన ఆమెను ఆటోలో జహీరాబాద్‌ శివారుకు తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత(24)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమెను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్‌, కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం రాత్రి ఆటో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం దిడ్గి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు జహీరాబాద్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. ఆటో ఎక్కిన తర్వాత వివాహితకు మత్తుమందు ఇచ్చి ఉంటారని లేదా మద్యం తాగించి ఉంటారని భావిస్తున్నారు.

Leave a Reply