లైంగిక వేధింపులను అడ్డుకుందని రైల్లో నుంచి మహిళ తోసివేత

0
28

చండీగఢ్‌: లైంగిక వేధింపులను ప్రతిఘటించిందని ఓ మహిళను కదులుతున్న రైల్లో నుంచి ఓ దుండగుడు బయటకు తోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన హరియాణాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. మృతురాలిని మన్‌దీప్‌ కౌర్‌(32)గా గుర్తించారు. ఆమె స్వస్థలం తొహానాలోని తూర్‌నగర్‌. మన్‌దీప్‌ కౌర్‌ రోహ్‌తక్‌లోని ఖారెంటి గ్రామం నుంచి తన తొమ్మిదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని గురువారం రాత్రి తొహానాకు రైల్లో బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న బోగీలో వీరితోపాటు మరో వ్యక్తి ఉన్నాడు.
కంపార్ట్‌మెంట్‌లో ఇంకెవరూ లేకపోవడంతో ఆ దుండగుడు మన్‌దీప్‌పై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అతని ప్రయత్నాన్ని ఆమె అడ్డుకుంది. కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి ఆమెను రైల్లో నుంచి తోసేశాడు. ఆపై తానూ దూకేశాడు.

రైలు తొహానాలో ఆగినప్పుడు మన్‌దీప్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమె భర్తకు కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. ఆరా తీయగా విషయాన్ని తండ్రికి వివరించాడు. బాలుడి తండ్రి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం తోహానా రైల్వేస్టేషన్‌కు 2 కి.మీ.ల దూరంలో మన్‌దీప్‌ మృతదేహం దొరికింది. గాయపడిన నిందితుడు సందీప్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply