యశ్వంత్ సిన్హా శాంతియాత్ర ప్రారంభం

0
253

– సీఏఏకు వ్యతిరేకంగా.. ఆరు రాష్ట్రాల మీదుగా..
ముంబయి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా బీజేపీ మాజీ నాయకుడు యశ్వంత్‌ సిన్హా మహారాష్ట్రలోని ముంబయిలో ‘గాంధీ శాంతియాత్ర’ పేరిట ర్యాలీ ప్రారంభించారు. జనవరి 9 (1955లో సౌతాఫ్రికా నుంచి మహాత్మగాంధీ తిరిగివచ్చిన రోజు)న గేట్‌ వే ఆఫ్‌ ఇండియా (సముద్రమార్గం గుండా గాంధీ చేరుకున్న ప్రదేశం)వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. మహారాష్ట్రతో పాటు, గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కొనసాగి, ఇదే నెల 30(నాథూరామ్‌ గాడ్సే చేతిలో గాంధీ హత్యకు గురైన రోజు)న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌(గాంధీ సమాధి)వద్ద ముగుస్తుంది. ఈ యాత్రలో అనేక మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. మహారాష్ట్రలో జరిగేటప్పుడు.. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరథ్‌ పవార్‌, కాంగ్రెస్‌ నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చౌహాన్‌, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ(వీబీఏ) నాయకుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ సహా ఇతర నాయకులు యాత్రలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ.. గాంధీజీ సామాజిక రాజకీయ ప్రయాణం, వివక్షపై పోరాటంతోనే మొదలైందని అన్నారు. ఆనాటి ఆంగ్లేయుల్లానే ఈనాటి బీజేపీ ప్రభుత్వం సైతం.. సీఏఏ, ఎన్నార్సీల రూపంలో దేశంలోని పేద లు, అణగారినవర్గాలను అణగదొక్కాలని చూస్తున్నదని విమర్శిం చారు. అందుకే, తోటి భారతీయులపై చూపిస్తున్న ఈ వివక్ష, అణచివేతలపై ప్రజలంతా గాంధీమార్గంలో నడవాల్సిన అవస రమున్నదని తెలిపారు. ర్యాలీ నేపథ్యంలో గుజరాత్‌, యూపీలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని ఆయా రాష్ట్ర ప్రభు త్వాలను కోరారు. యూపీలో నిరసనకారులపై జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము చేపట్టనున్న ఈ యాత్ర.. కులమ తాలకతీతంగా, రాజ్యాంగ విరుద్ధపాలనకు వ్యతిరేకంగా సాగుతుందని వెల్లడించారు. అలాగే, జేఎన్‌యూలో జరిగిన దాడిని సిన్హాతో పాటు ఇందు లో పాల్గొన్న పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదని విమర్శించారు. జేఎన్‌యూ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Courtesy Nava telangana

Leave a Reply