యువతలో పెరుగుతున్న నిస్పృహ.. భారత ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు!

0
260
  •  డిజిటల్‌ అసమానతలు, రాష్ట్రాల మధ్య గొడవలు కూడా..
  •  ప్రపంచ ఆర్థిక వేదిక సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ/జెనీవా : కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో ప్రజలంతా డిజిటల్‌ విధానాలపైనే ఆధారపడ్డారు. ఫలితంగా అంతర్జాతీయంగా సైబర్‌ నేరాల ముప్పు పెరిగిపోయింది. అదేసమయంలో యువతలో నిస్పృహలు విపరీతంగా పెరిగిపోవడం, డిజిటల్‌ అసమానతలు, రాష్ట్రాల మధ్య గొడవలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముప్పులుగా పరిణమించాయని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసిన సర్వే వెల్లడించింది. వచ్చేవారం ఆన్‌లైన్‌లో దావోస్‌ అజెండా సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ మంగళవారం ‘ది గ్లోబల్‌ రిస్క్స్‌ రిపోర్ట్‌ 2022’ను విడుదల చేసింది. దీర్ఘకాలంలో ప్రభావం చూపే రిస్కుల్లో వాతావరణానికి సంబంధించినవే ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా టాప్‌ 10 ముప్పుల్లో వాతావరణం లేదా పర్యావరణానికి సంబంధించినవే ఐదు ఉన్నాయని పేర్కొంది. వాతావరణ సంక్షోభం, సామాజిక విభేదాలు పెరిగిపోవడం, సైబర్‌ ముప్పుల తీవ్రత, కరోనా మహమ్మారి నుంచి కోలుకొనే క్రమంలో అంతర్జాతీయ అసమానతలను ప్రధాన ముప్పులుగా సర్వే గుర్తించింది. ఇదిలా ఉండగా గడిచిన రెండేళ్లుగా డిజిటల్‌ విధానంపై ఎక్కువగా ఆధారపడడంతో సైబర్‌ భద్రతకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపింది. భారత్‌ విషయానికి వస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణించడం, రుణ సంక్షోభాలు, యువతలో పెరిగిపోతున్న నిస్పృహ, డిజిటల్‌ అసమానతలు, టెక్నాలజీ ఆధారిత పాలనలో వైఫల్యం.. ఈ అంశాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు కోలుకొనే తీరులో తీవ్ర అసమానతలు ఉంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారని ప్రపంచ ఆర్ధిక వేదిక సర్వే స్పష్టం చేసింది.

Courtesy Andhrajyothi

Leave a Reply